Site icon NTV Telugu

Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ మేనేజర్‌, నిర్వాహకుడిపై మర్డర్ కేసు నమోదు

Singer Zubeen Garg2

Singer Zubeen Garg2

అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఉత్సవ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంతలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసింది. తాజాగా దర్యాప్తు బృందం 14 రోజుల కస్టడీకి తీసుకుంది. సిద్ధార్థ శర్మ, శ్యామ్‌కాను మహంతలపై హత్యా అభియోగాలు నమోదయ్యాయని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: MP: దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం.. 11 మంది భక్తుల మృతి

ప్రస్తుతం ఇద్దరినీ ఉలుబారిలోని నేర పరిశోధన విభాగం (CID) కార్యాలయంలో విచారిస్తున్నారు. దర్యాప్తు చట్ట ప్రకారం కఠినంగా కొనసాగుతుందని సిట్ చీఫ్ గుప్తా తెలిపారు. మహంతపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేయబడిన తర్వాత సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 103 హత్య కేసు నమోదు చేశారు. హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు లేదంటే జరిమానాతో పాటు శిక్ష విధించాలని ఇది నిర్దేశిస్తుంది.

ఇది కూడా చదవండి: Delhi Baba Horror: అమ్మాయి నచ్చితే ప్రత్యేక గది.. ఖరీదైన సెల్‌ఫోన్లు.. వెలుగులోకి ఢిల్లీ బాబా దురాగతాలు

జుబీన్ గార్గ్ (52) సింగపూర్‌లోని నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌‌కు వెళ్లారు. సెప్టెంబర్ 19న సముద్రంలో ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయారు. పోస్ట్‌మార్టంలో మునిగి చనిపోయినట్లు వెల్లడైంది. జుబీన్ గార్గ్ మరణంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. అస్సాంలో 60కి పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.

తాజాగా జుబీన్ గార్గ్ మరణంపై ఆయన భార్య గరిమా గార్గ్ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త ఆరోగ్యం బాగోలేకపోయినా.. బలవంతంగా సింగపూర్ తీసుకెళ్లారని గరిమా గార్గ్ ఆరోపించారు. సింగపూర్ తీసుకెళ్లాక జుబీన్ గార్గ్ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తన భర్తకు గుండె జబ్బు ఏమీలేదని చెప్పారు. జుబీన్ గార్గ్ ప్రయాణంలో అలసిపోయారని.. అంతేకాకుండా మందులు వాడుతున్నారని చెప్పుకొచ్చారు. మందులు వాడుతున్న వ్యక్తిని ఎందుకు పిక్నిక్, ఈతకు ఎందుకు తీసుకెళ్లారని ఈవెంట్ నిర్వాహకులను గరిమా గార్గ్ నిలదీశారు. జుబీన్ గార్గ్ మేనేజర్ దగ్గరే ఉన్నప్పుడు ఎందుకు జాగ్రత్తగా చూసుకోలేదని ప్రశ్నించారు. జుబీన్ గార్గ్ నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారని స్పష్టం చేశారు. అస్సాం సాంస్కృతిక చిహ్నాన్ని మనం కోల్పోయినట్లు ఆవేదనను గరిమా గార్గ్ వ్యక్తం చేశారు.

జుబీన్ గార్గ్‌ చనిపోక ముందు ఫోన్‌లో మాట్లాడానని.. ఒక్కసారి కూడా పిక్నిక్ అంశాన్ని ప్రస్తావించలేదని గుర్తుచేశారు. అంటే పిక్నిక్ అంశం జుబీన్ గార్గ్‌ కూడా తెలియకపోవచ్చని పేర్కొన్నారు. జుబీన్ గార్గ్ ఎప్పుడూ పగటి పూటే నిద్రపోతారని.. అలాంటిది బలవంతంగా తీసుకెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. జుబీన్ గార్గ్ ఎప్పుడూ మందులు వాడుతుంటారు. అలాంటిది మందులు ఇచ్చారో లేదో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు.

ఈవెంట్ నిర్వాహకులలో ఒకరైన సిద్ధార్థ్‌కు ఫోన్ చేశానని.. ఈతకు వెళ్లినప్పుడు నీటిలోపల మూర్ఛ వచ్చిందని చెప్పాడని పేర్కొంది. జుబీన్ గార్గ్‌కు ఎప్పుడూ గుండె పోటు వచ్చిన దాఖలాలు ఏమీ లేవన్నారు. ఆనాటి సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇవ్వాలని నిర్వాహకులను అడిగానని.. కానీ ఇప్పటి వరకు మాత్రం అందించలేదని చెప్పుకొచ్చారు. జుబీన్ గార్గ్ మరణం వెనుక చాలా కారణాలు ఉండొచ్చని.. ఇది స్కూబా డ్రైవింగ్ వల్ల జరిగిన మరణం కాదని.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. కచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆమె కోరింది.

న్యాయ వ్యవస్థపై తనకు విశ్వాసం ఉందని.. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని గరిమా గార్గ్ చెప్పుకొచ్చారు. మనకు అతి త్వరలో న్యాయం జరుగుతుందని… దీన్ని కచ్చితంగా తాను నమ్ముతున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. జుబీన్ గార్గ్ ఎప్పుడు అస్సాం ప్రజల గురించే ఆలోచించేవాడని.. ప్రకృతే ఆయనకు దేవుడు అని గరిమా గార్గ్ పేర్కొన్నారు.

Exit mobile version