Sidhu Moose Wala: పంజాబీ సింగర్ దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (28) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. తన స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సిద్ధూ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ.. రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం పలు అనుమానాలకి తావిస్తోంది.
కాగా.. సిద్ధూ మూసేవాలా అసలు పేరు శుభ్‌దీప్ సింగ్ సిద్ధూ! తుపాకులు, గ్యాంగ్స్టర్లు వంటి హింసను ప్రేరేపించేవి ఇతని పాటల్లో ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇతను వివాదాస్పద గాయకుడిగా గతంలో వార్తల్లో నిలిచాడు. ఇతను పాడిన బింబిహ బోలే, 47 పాటలు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. తేరీ మేరీ జోడీ, మోసా జఠ్ వంటి సినిమాల్లో నటించిన ఇతనిపై.. 2020లో లాక్డౌన్ విధించినప్పుడు ఫైరింగ్ రేంజ్లో ఏకే-47 రైఫిల్‌ని ఉపయోగించినందుకు కేసు నమోదైంది. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్ధూ.. తాజా ఎన్నికల్లో పంజాబ్‌లోని మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆప్ అభ్యర్థి డా. డిజయ్ సింగ్లా చేతిలో ఓడిపోయారు.
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
- Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్‌కు తిరుగులేదు..
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
గత నెలలో సిద్ధూ రిలీజ్ చేసిన ‘స్కేప్‌గోట్’ పాటలో ఆమ్ ఆద్మీ పార్టీని, దాని మద్దతుదారుల్ని టార్గెట్ చేశాడు. అందులో ఆప్ సపోర్టర్స్‌ని ‘ద్రోహులు’గా పేర్కొన్నాడు. ఆ పాట తీవ్ర దుమారం రేపింది. ఆప్ వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. సిద్ధూ హత్యపై రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రతిభావంతుడైన సిద్ధూ హత్య విషయం తెలిసి తాను తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యానని అన్నారు. అటు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?