Site icon NTV Telugu

Siddaramaiah: డీకే వ్యాఖ్యలకు కౌంటర్‌గా సిద్ధరామయ్య సంచలన ట్వీట్..

Dksivakumar

Dksivakumar

Siddaramaiah: కర్ణాటక కాంగ్రెస్‌లో పవర్ షేరింగ్ వివాదం మరింత ముదిరింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2023 ఎన్నికల తర్వాత, అధిష్టానం హామీ ఇచ్చినట్లు చెరో రెండున్నరేళ్లు సీఎం పోస్టును పంచుకోవాల్సిందే అని డీకే శివకుమార్ వర్గం చెబుతోంది. మరోవైపు, సిద్ధరామయ్యనే 5 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పంచాయతీ కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంది.

Read Also: Venkaiah Naidu: తెలుగులో తిట్టినా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషను మర్చిపోయిన వాడు మనిషే కాదు..!

ఇదిలా ఉంటే, ఈ రోజు ఉదయం డీకే శివకుమార్ ‘‘ మాట అనే శక్తి అంటే ప్రపంచ శక్తి’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పరోక్షంగా ఇచ్చిన మాట తప్పకూడదని చెప్పారు. అయితే, దీనికి కౌంటర్‌గా సిద్ధరామయ్య సంచలన ట్వీట్ చేశారు. ‘‘ఒక మాట ప్రపంచాన్ని, ప్రజలకు ప్రయోజనంగా చేయకపోతే అది శక్తి కాదు’’ అని కామెంట్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య పరోక్షంగా మాటల యుద్ధం జరుగుతోందని స్పష్టమవుతోంది. ఇక్కడితో ఆగకుండా.. ‘‘ కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక మూమెంట్ కాదు, ఇది ఐదేళ్లు కొనసాగే బాధ్యత. నాతో సహా కాంగ్రెస్ పార్టీ కరుణ, స్థిరత్వం, ధైరంతో మన ప్రజల కోసం వాగ్ధానం నడుస్తుంది. కర్ణాటకలో మన హామీలు నినాదం కాదు, అది మనకు ప్రపంచం’’ అని సిద్ధరామయ్య కామెంట్స్ రాశారు.

దీనికి ముందు డీకే శివకుమార్ ఒక ట్వీట్‌లో పరోక్షంగా కాంగ్రెస్ అధిష్టానికి మెసేజ్ పంపించారు. ‘‘మాట అనే శక్తి ప్రపంచ శక్తి. అంటే మన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ప్రపంచంలోని అతిపెద్ద శక్తులలో ఒకటి.’’ అని రాశారు.

Exit mobile version