Site icon NTV Telugu

Siddaramaiah: కమల్‌హాసన్‌కు ఆ విషయం తెలియదు.. ముఖ్యమంత్రి అసహనం

Siddaramaiah

Siddaramaiah

కన్నడ భాషపై అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన నటించిన కొత్త సినిమా ‘థగ్ లైఫ్’ను బ్యాన్ చేయాలంటూ కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇటు పొలిటికల్‌‌గా.. అటు రెండు రాష్ట్రాల మధ్య తగాదాగా తయారైంది. ఈ వ్యవహారంపై తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కమల్‌హాసన్‌కు చరిత్ర తెలియదని.. అందుకే ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Jyoti Malhotra: జైల్లో జ్యోతి మల్హోత్రాను కలిసిన తండ్రి.. మీడియాకు ఏం చెప్పాడంటే..!

కమల్‌హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నాకు కుటుంబం ఉంది. అందుకే వచ్చాను. మీ భాష (కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టిందని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రైతులకు గుడ్‌న్యూస్‌.. 51 కోట్లు విడుదల

కమల్‌హాసన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కన్నడ భాషకు చాలా చరిత్ర ఉందని.. పాపం కమల్‌హాసన్‌కు ఆ విషయాలేవీ తెలియవని ఎద్దేవా చేశారు. ఇదే వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర స్పందిస్తూ.. మాతృభాషను ప్రేమించడం మంచిదేగానీ.. ఇతర భాషలను అవమానించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కన్నడిగులకు కమల్‌హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

Exit mobile version