BJP: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ‘‘టెర్రరిస్ట్’’ అని పిలవడంపై వివాదం మొదలైంది. సీఎం వ్యాఖ్యలకు కౌంటర్‌గా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ‘‘ ఆయనకు మెంటల్ ట్రీట్మెంట్ అవసరం’’ అని అన్నారు. దీనికి ముందు ఆదివారం సిద్ధరాయమ్య హుబ్బల్లి అల్లర్లలో నిందితులైన మైనారిటీ వ్యక్తులపై కేసులు విత్ డ్రా అంశంపై మాట్లాడారు. ‘‘కేసుల ఉపసంహరణపై తీసుకున్న నిర్ణయం కోర్టు ముందుకు వెళ్తుంది. కోర్టు అంగీకరిస్తే కేసులు ఉపసంహరించుకుంటాం. లేకుంటే కేసుల్ని ఉపసంహరించుకోం. బీజేపీ నేతలపై కూడా కేసులు ఉపసంహరించుకుంటున్నాం. నిరాధారమైన అంశాలపై బీజేపీ నిరసన చేస్తోంది. ప్రహ్లాద్ జోషి పెద్ద ఉగ్రవాది’’ సిద్ధరామయ్య అన్నారు.
Read Also: Draupadi Murmu: మూడు ఆఫ్రికన్ దేశాల పర్యటనకు అధ్యక్షురాలు ముర్ము.. కారణాలు?
సిద్ధరామయ్య ప్రకటనపై ప్రహ్లాద్ జోషి ఘాటుగా స్పందించారు. ‘‘ఇక్కడి నుంచి మనం నేర్చున్నది ఏంటంటే.. సిద్ధరామయ్య నిజంగా బాధతో ఉన్నారని, అధికారం వస్తుంది, పోతుంది, అధికారం పోతుందేమోనన్న భయం ఆయనలో రోజూ కనిపిస్తోంది. హైకోర్టు అతడికి పెద్ద షాక్ ఇచ్చింది. అతడు మానసిక సమతుల్యత కోల్పోయాడు. అతడికి మెంటల్ ట్రీట్మెంట్ అవసరం’’ అని అన్నారు. 2022 ఏప్రిల్ 16న హుబ్బల్లి పట్టణంలో పోలీసులపై రాళ్లతో దాడి చేసిన ముస్లింగుంపుపై నమోదైన క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలని కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ముఖ్యంగా ప్రహ్లాద్ జోషితో సహా బీజేపీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది. ముస్లింలను బుజ్జగించే నిర్ణయంగా అభివర్ణించింది.