Congress: ముఖ్యమంత్రి మార్పు, ఎమ్మెల్యేలు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. పరిస్థితి సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్‌గా మారింది. తర్వలోనే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొందరు ఎమ్మెల్యేలు కామెంట్ చేస్తుంటే, మరికొందరు సిద్ధరామయ్యే మా సీఎం అని చెబుతున్నారు. దీంతో కర్ణాటకలో రాజకీయ రసవత్తరంగా మారింది.
Read Also: Madhusudhana Chary: తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నారని బీజేపీని నమ్ముతారు..
సిద్ధరామయ్యను మార్చే యోచన లేదని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బీఆర్ పాటిల్ ఫోన్ వీడియో ఇప్పుడు కొత్త చర్చకు కారణమైంది. ‘‘సిద్ధరామయ్యకు లాటరీ తగిలింది. సోనియా గాంధీకి నేనే ఆయనను పరిచయం చేశాను. ఆయన అదృష్టం బాగుందని, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. నాకు గాడ్‌ఫాదర్ లేదా దేవుడు లేడు. నేను (రణ్‌దీప్ సింగ్) సుర్జేవాలాను కలిశాను , నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను. వారు ఓపికగా నా మాట విన్నారు, ఏమి జరుగుతుందో చూద్దాం’’ అని అన్నారు.
సిద్ధరామయ్య సీఎం కావడానికి తాను కీలక పాత్ర పోషించానని పాటిల్ అన్నారు. ఆయన గ్రహాలు బాగుండటంతో అత్యున్నత పదవి దక్కిందని పేర్కొన్నారు. అదే సమయంలో తన రాజకీయ జీవితంలో ఇలాంటి అదృష్టం లేదని పాటిల్ అంటున్న వీడియో వైరల్ అయింది.
