కర్ణాటకలో ప్రస్తుతం ‘పవర్ షేరింగ్’ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల వేడుక జరుపుకుంది. అప్పటినుంచే పవర్ షేరింగ్ పంచాయితీ మొదలైంది. మిగతా రెండున్నరేళ్లు డీకే.శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆయన వర్గం ఎమ్మెల్యేలు హస్తినలో హైకమాండ్ దగ్గర డిమాండ్ చేసింది. దీంతో కొద్దిరోజులుగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య పవర్ షేరింగ్ రగడ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: Renuka Chowdhury: కుక్కతో పార్లమెంట్‌కు హాజరైన రేణుకా చౌదరి.. బీజేపీ ఎంపీల ఆగ్రహం
ఈ క్రమంలోనే గత శనివారం డీకే.శివకుమార్‌ను సిద్ధరామయ్య బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించారు. అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. అంతా మీడియా సృష్టేనని పేర్కొన్నారు. తాజాగా డీకే.శివకుమర్ కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించారు. మంగళవారం ఉదయం డీకే ఇంటికి అల్పాహారం కోసం సిద్ధరామయ్య వెళ్లనున్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra: మహిళలకు భర్తలు రూ.100 కూడా ఇవ్వరు.. ఎన్నికల ప్రసంగంలో ఓ మంత్రి కీలక వ్యాఖ్యలు
బ్రేక్‌ఫాస్ట్‌లతో ఈ వ్యవహారం సాగిపోతుందా? లేదంటే ఇంకేమైనా జరగబోతుందా? అనేది భవిష్యతే చెప్పాలి. డీకే.శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని.. 2028 మళ్లీ కర్ణాటకలో కాంగ్రెస్ రావాలంటే డీకే.శివకుమార్‌ను సీఎంను చేస్తేనే సాధ్యమవుతుందని ఆయన వర్గీయులు గట్టిగా వాదిస్తున్నారు. అయితే ఈ పంచాయితీకి కాంగ్రెస్ ఫుల్‌స్టాప్ పెడుతుందా? లేదంటే సాగదీస్తుందో వేచి చూడాలి.
