Giriraj Singh: ప్రముఖ ముస్లిం నేత మౌలానా అర్షద్ మదానీ ‘భజరంగ్ దళ్’ని కర్ణాటకలో నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై బీజేపీ నేత కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విరుచుకుపడ్డారు. కర్ణాటక ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మానిఫెస్టోలో భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది. పీఎఫ్ఐతో పాటు భజరంగ్ దళ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హమీని మదానీ సమర్థించారు. ఇది 70 ఏళ్ల క్రితమే తీసుకోవాల్సిన చర్యగా అభిప్రాయపడ్డారు.
Read Also: Dimple Hayathi : హీరోయిన్ డింపుల్ హయతి పై క్రిమినల్ కేసు
మదానీపై తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విభజన సమయంలోనే ముస్లింలందరినీ పాకిస్తాన్ కు పంపించి ఉందాల్సిందంటూ వ్యాఖ్యానించారు. బీహార్ లోని బెగుసరాయ్ లోక్ సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. మన పూర్వీకులు చేసిన తప్పు వల్ల ముస్లింలు ఉన్నారని.. అప్పుడే వారందరిని పాకిస్తాన్ పంపింతే.. మదానీ, అసదుద్దీన్ ఓవైసీ వంటి వారిలో పోరాడాల్సిన అవసరం ఉండేది కాదని, భారతదేశంపై ‘గజ్వా-ఎ-హింద్’ ముప్పు ఉండకపోయేదని ఆయన అన్నారు. టిప్పు సుల్తాన్ ఒక ఆక్రమణదారుడు. అతను భారత సంపద దోచుకోవడానికి ఈ గడ్డపై కాలు మోపాడని, బ్రిటిష్ వారిపై ఆయన చేసిన పోరాటం స్వాతంత్ర పోరాటం కాదని, తన సొంత రాజ్యాన్ని కాపాడుకునే లక్ష్యమని గిరిరాజ్ సింగ్ అన్నారు.
గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై జేడీయూ పార్టీ స్పందించింది. ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయిన గిరిరాజ్ సింగ్ అఖండ భారత్ గురించి మాట్లాడుతుంటారని, అలాంటిది ఇప్పుడు ముస్లింలందర్ని పాకిస్తాన్ పంపాలని చెప్పడం ద్వారా అఖండ భారత్ భావనను తిరస్కరించినట్లే అని జేడీయూ అధికార పార్టీ ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ అన్నారు.