పబ్ లో షాట్స్ ఆర్డర్ చేసిన యువతి.. అతడు అలా చేయడంతో చివరికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరదాగా పబ్ కి వెళ్లిన ఆ యువతికి చేదు అనుభవం ఎదురయ్యింది. షాట్స్ తాగి స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామనుకున్న ఆమె ఆసుపత్రి పాలయ్యింది. పబ్ స్టాపర్ నిర్లక్ష్యం వలన ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం బెంగుళూరుకు చెందిన ఒక యువతి, తన ముగ్గురు స్నేహితులతో కలిసి రెసిడెన్సీ రోడ్ లోని ఒక పబ్ కి వెళ్లింది. మిగతా స్నేహితులందరూ ఆ పబ్ లో సాంబుకా షాట్స్ బావుంటాయని చెప్పడంతో వాటినే ఆర్డర్ చేసింది. పబ్ స్టాపర్ ఆ వేడి వేడి షాట్స్ ని డైరెక్ట్ గా గొంతులోనే పోసుకోవాలని చెప్పడంతో పాటు అలాగే ఆమె గొంతులో పోసేశాడు. దీంతో ఒక్కసారిగా యువతి గొంతులో మంటలు చెలరేగాయి.
ఒక్కసారిగా ఊహించని ఘటనను చూసి షాక్ అయిన ఆమె స్నేహితులు వెంటనే ఆమెను హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు. కొన్ని రోజూల తర్వాత కోలుకున్న ఆమె ఆ పబ్ పై కన్జ్యూమర్ కోర్టు లో కేసు వేసింది. తాను ఆసుపత్రి పాలు కావడానికి కారణం పబ్ స్టాపర్ యేనని తెలుపుతూ మెడికల్ రిపోర్ట్స్, బిల్స్ అన్ని కోర్టు లో సబ్మిట్ చేసింది. వాదోపవాదాలు విన్న కోర్టు పబ్ దే తప్పని, ఆమె మెడికల్ బిల్స్ మొత్తాన్ని పబ్ యాజమాన్యమే క్లియర్ చేయాలని తెలుపుతూ తీర్పు చెప్పింది. దీంతో సదరు పబ్ యాజమాన్యం ఆమె మెడికల్ బిల్ రూ. 74 వేలతో పాటు కోర్టు ఖర్చులను కూడా చెల్లించింది.
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
- Tags
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!