Site icon NTV Telugu

Shivraj Singh Chouhan: లోక్‌సభ బరిలో మాజీ సీఎం శివరాజ్ చౌహాన్.. విదిశ నుంచి పోటీ..

Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే 100 మందితో తొలి జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్ కొలిక్కి రాకపోవడంతో, వారిపై మరింత ఒత్తిడి పెంచేందుకు బీజేపీ పక్కాగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ని బీజేపీ లోక్‌సభ బరిలో నిలుపనున్నట్లు తెలుస్తోంది.

Read Also: PM Modi: “సందేశ్‌ఖలీ”పై స్పందించిన పీఎం మోడీ.. ఆయన ఆత్మ క్షోభిస్తోందని మమతా పార్టీపై ఫైర్..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ విజయాలకు కేరాఫ్‌గా ఉన్న శివరాజ్ సింగ్‌ని కాదని ఈ సారి మోహన్ యాదవ్ అనే వ్యక్తిని బీజేపీ సీఎంగా చేసింది. మధ్యప్రదేశ్‌లో చౌహాన్ 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతేడాది ఎన్నికల్లో అధికార వ్యతిరేకత ఉన్నప్పటికీ మరోసారి బీజేపీకి అఖండ విజయాన్ని అందించారు. అతనున ప్రవేశపెట్టిన లాడ్లీ బహెన్ పథకం ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది.

ఈ సారి శివరాజ్ సింగ్ చౌహాన్ సేవల్ని బీజేపీ కేంద్రంలో వినియోగించుకోవాలని అనుకుంటోంది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో నిలుపుతోంది. రాష్ట్రంలోని విదిశ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపనున్నట్లు సమాచారం. జ్యోతిరాదిత్య సింథియా, వీడి శర్మలను రాష్ట్రంలోని గుణ, ఖజురహో నుంచి పోటీకి దింపే అవకాశం ఉంది. 2019లో తక్కువ మార్జిన్‌లో బీజేపీ ఓడిపోయిన స్థానాలలో అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి వారు తొలిజాబితాలో ఉంటారని తెలుస్తోంది.

Exit mobile version