NTV Telugu Site icon

Shreya Ghoshal: ‘‘వెన్నులో వణుకు పుట్టిస్తోంది’’..కోల్‌కతా ఘటనపై శ్రేయా ఘోషల్ స్పందన..

Shreya Ghoshal

Shreya Ghoshal

Shreya Ghoshal: ప్రముఖ గాయని, జాతీయ అవార్డు విన్నర్ శ్రేయా ఘోషల్ కోల్‌కతాలో సెప్టెంబర్ 14న జరగాల్సిన తన కచేరిని వాయిదా వేసుకున్నారు. ఈ నెల ప్రారంభంలో కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనతో యావత్ దేశం అట్టుడికింది. బాధితురాలకి న్యాయం చేయాలంటూ డాక్టర్ల, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బెంగాల్ వ్యాప్తంగా ఇప్పటికీ నిరసలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: Rahul Gandhi: అమెరికాకు రాహుల్ గాంధీ.. డల్లాస్, వాషింగ్టన్‌ డీసీల్లో పర్యటన..

ఈ నేపథ్యంలోనే శ్రేయా ఘోషల్ కార్యక్రమం వాయిదా పడింది. ఈ కచేరీని అక్టోబర్‌లో కొత్త తేదీకి మార్చనున్నారు. వైద్యురాలి ఘటనపై శ్రేయా ఘోషల్ స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘భయంకరమైన మరియు హేయమైన సంఘటనతో తాను తీవ్రంగా ప్రభావితమయ్యాను. నేను కూడా ఓ స్త్రీ అయినందున ఆమె అనుభవించిన దారుణమైన క్రూరత్వం యొక్క ఆలోచన ఊహిచలేనిది. నా వెన్నులో వణుకు పుట్టిస్తోంది.. నేను ఓ స్టాండ్ తీసుకోవడం, మీ అందరికి సంఘీభావం తెలియజేయడం తప్పనిసరి. మన దేశంలోనే కాకుండా ఈ ప్రపంచంలోని మహిళల గౌరవం మరియు భద్రత కోసం నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను’’ అని ఆమె పోస్టులో రాశారు.

ఆగస్టు 09న కాలేజీలోని సెమినార్ హాలులో నిద్రిస్తున్న సమయంలో వైద్యురాలిపై సంజయ్ రాయ్ అనే నిందితుడు అత్యాచారం, హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో కోల్‌కతా పోలీసులు, మమతా బెనర్జీ సర్కార్ తీవ్రంగా వైఫల్యం చెందిందని కలకత్తా హైకోర్టు పేర్కొంటూ, ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై వైద్యులు దేశవ్యాప్తంగా ఆందోళన చేయడంతో, సుప్రీంకోర్టు కలుగజేసుకుని వారంతా విధుల్లో్ చేరాలని కోరింది.