టర్కీపై భారతీయుల బాయ్‌కట్ ఉద్యమం కొనసాగుతోంది. ఇప్పటికే టర్కీ ఉత్పత్తులను.. పర్యాటకరంగాన్ని నిషేధించారు. ఇలా ఒక్కొక్కటిగా టర్కీకి సంబంధించిన వాటిపై నిషేధం కొనసాగుతోంది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టు దగ్గర శివసేన నేతలు ఆందోళన చేపట్టారు. టర్కిష్ సంస్థకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 10 రోజులు అల్టిమేటం విధించారు. టర్కిష్ సంస్థ మన దగ్గర డబ్బు సంపాదించి పాకిస్థాన్‌కు సాయం చేయడానికి ఉపయోగిస్తుందని శివసేన నాయకులు ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Donald Trump: భారత్‌లో ఆపిల్ ప్లాంట్లు పెట్టడం మాకు ఇష్టం లేదు: టిమ్‌కుక్‌తో ట్రంప్..
టర్కీకి చెందిన గ్రౌండ్-హ్యాండ్లింగ్ సంస్థ సెలెబీ ఎన్ఏఎస్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ పనులు చేస్తుంది. 70 శాతం పనులు నిర్వహిస్తోంది. ప్రయాణికుల నిర్వహణ, విమాన కార్యకలాపాలు, కార్గో లాజిస్టిక్స్ పనులను నిర్వహిస్తోంది. అయితే గురువారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర నిరసన చేపట్టారు. వెంటనే టర్కీ సంస్థ సర్వీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ నేతృత్వంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు 10 రోజులు అల్టిమేటం విధించారు.
ఇది కూడా చదవండి: CPI General Secretary D Raja: ఇండియాపై ట్రంప్ పెత్తనమేంటి..?
జాతీయ భద్రత నేపథ్యంలో టర్కీ సంస్థ సర్వీసులను రద్దు చేయాలని ఎయిర్‌పోర్టు ఆఫీసర్‌కు ఎమ్మెల్యే ముర్జీ పటేల్ లేఖ రాశారు. 10 రోజుల్లో ఈ నిర్ణయం తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. తక్షణమే అనుమతులు నిలిపివేయాలని.. లేదంటే రద్దు చేయాలంటూ కోరారు. సెలెబి కార్యకలాపాలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరారు. తమ డిమాండ్ నేరవేరకపోతే 10 వేల మంది కార్యకర్తలతో తీవ్ర నిరసన చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లో టర్కిష్ ఆపిల్ దిగుమతులు నిషేధించాలని ప్రధాని మోడీకి కూడా లేఖ రాశారు.
ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ సమయంలో పాకిస్థాన్‌కు టర్కీ ఆయుధాలు సరఫరా చేసింది. ఈ వ్యవహారం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. టర్కీని నిషేధించాలని భారతీయులు నిర్ణయం తీసుకున్నారు.
