మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ వీడడం లేదు. అసెంబ్లీ ఫలితాలు వచ్చి దాదాపు 7 రోజులు అవుతున్నా.. సీఎం ఎవరనేది తేల్చలేకపోయారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చకపోవడంతో ఏక్‌నాథ్ షిండే తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో అలకబూని ఆయన సొంత గ్రామానికి వెళ్లిపోయారు. అయితే తాజాగా షిండేకు చెందిన శివసేన పార్టీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడితే.. పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Potato Rate : ఒక్క సారిగా పెరిగిన బంగాళాదుంప ధరలు.. పెరగడానికి కారణం ఇదే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) ఘన విజయం సాధించింది. అయితే కూటమిలో నెలకొన్న అంతర్గత విభేదాలతో సీఎం ఎంపిక కావడంలేదని తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన.. బీహార్ ఫార్ములా అమలు చేయాలని.. నితీష్‌కుమార్‌లాగానే షిండేను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తోంది. బీహార్‌లో నితీష్ కుమార్ పార్టీకి మెజార్టీ లేకపోయినా సీఎంగా కొనసాగుతున్నారు. అదే పద్ధతిని మహారాష్ట్రలో అమలు చేయాలని శివసేన డిమాండ్ చేస్తోంది. కానీ బీజేపీ 132 అసెంబ్లీ సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పోస్టు.. కమలనాథులే దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇలా ఇరు పార్టీల మధ్య తర్జన భర్జనతో పంచాయితీ ఎటు తెగకుండా నాన్చుడి సాగుతోంది. మరోవైపు అలకతో షిండే తన సొంతూరు వెళ్లిపోయారు. సతారా జిల్లాలోని తన స్వగ్రామమైన డేర్‌కు వెళ్లారు.
ఇది కూడా చదవండి:CM Chandrababu: రాజ్‌భవన్‌కు సీఎం చంద్రబాబు.. గవర్నర్, మాజీ రాష్ట్రపతితో మంతనాలు..
ఇదిలా ఉంటే ఈ అర్ధరాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ప్రకటించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు శివసేన నేత సంజయ్ శిర్సత్ అన్నారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ప్రధాని మోడీ, అమిత్ షా నిర్ణయించారని… ఈరోజు అర్ధరాత్రిలోగా సీఎం పేరు ప్రకటిస్తారని పేర్కొన్నారు. డిసెంబరు 2న ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. పదవులకు దూరంగా ఉండాలని పార్టీ నేతలకు షిండే సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Alone Honeymoon: ఒంటరిగా హనీమూన్‌కి వెళ్లిన పెళ్లికూతురు.. ఇదో విషాధ గాధ!