ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ పలు రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయంపై ఒమిక్రాన్ ప్రభావం పడింది. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించడంతో అధికారులు ఆలయ వేళల్లోనూ మార్పులు చేశారు. షిర్డీ సాయిబాబా ఆలయాన్ని రాత్రి వేళ మూసివేస్తున్నట్టు షిర్డీసాయి సంస్థాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: 2021: రివైండ్ – ప్రభావం చూపని న్యూ డైరెక్టర్స్
మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించడంతో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆలయం మూసి ఉంచుతామని షిర్డీ సాయి ట్రస్ట్ వెల్లడించింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే ఆలయాన్ని తెరిచి ఉంచుతామని అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు, 10 గంటలకు జరిగే హారతులు కేవలం అర్చకుల సమక్షంలోనే జరుగుతాయని, భక్తులను అనుమతించమని వారు స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే మహారాష్ట్రలో 110 ఓమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి.
