NTV Telugu Site icon

Eknath Shinde: డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే సొంత ప్రసంగం.. షాకైన మహాయుతి నేతలు

Eknath Shinde

Eknath Shinde

Eknath Shinde: గత 10 రోజులుగా మహారాష్ట్రలో కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు ఈరోజు తెరపడింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా, శివసేన (షిండే) చీఫ్ ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ (ఏపీ) అధినేత అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మహాయుతి కూటమిని లాస్ట్ వరకు టెన్షన్‌కు గురి చేసిన షిండే ప్రమాణ స్వీకారం సందర్భంగా సొంత ప్రసంగం చదివారు.

Read Also: Maoist Party: పోలీసులే విషమిచ్చి చంపారు.. 9న రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపు

అయితే, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఇక, ఏక్‌నాథ్‌ షిండే అక్కడున్న స్క్రిప్ట్‌ను చదవకుండా సొంతంగా ప్రసంగించారు. నా గురువు ధర్మవీర్ ఆనంద్ దిఘేని స్మరిస్తూ.. హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రేకు నా ప్రణామాలు.. అలాగే, ప్రధాని మోడీ బలమైన నాయకత్వంలో.. హోంమంత్రి అమిత్ షా ఆశీర్వాదంతో పాటు మహారాష్ట్రలోని 13 కోట్ల మంది ఓటర్ల సపోర్టుతో అని ప్రసంగం చేశారు. దీంతో వేదికపై ఉన్న మోడీ, అమిత్ షా, ఫడ్నవీస్ సహా ముఖ్యనేతలందరూ షాక్‌ అయ్యారు. ఏం జరుగుతుందో తెలియక తికమక పడ్డారు.

Read Also: Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రసంగాలపై నిషేధం..

ఇక, ఏక్‌నాథ్‌ షిండే ప్రసంగాన్ని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అడ్డుకోవడంతో.. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకార ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తూ.. తిరిగి ‘నేను’ అని చెప్పుకొచ్చారు. దీంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణం చేశారు. అయితే, ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణ స్వీకారం చెల్లినప్పటికీ ప్రోటోకాల్‌ను ఆయన పాటించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.