NTV Telugu Site icon

PM Modi: ‘హిందూ మతాన్ని అవమానిస్తోంది’.. రాహుల్ గాంధీ “శక్తి” వ్యాఖ్యలపై పీఎం మోడీ ఆగ్రహం..

Pm Modi

Pm Modi

PM Modi: ఇండియా కూటమి నేతలు ఉద్ధేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యాడు. తమిళనాడు సేలంలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం పాల్గొన్నారు. ఏప్రిల్ 19న ప్రతీ ఒక్కరూ బీజేపీ-ఎన్డీయే కూటమికి ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్తించారు. ‘‘ ఇండియా కూటమి నేతలు హిందూ మతాన్ని పదేపదే ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారు. ముఖ్యంగా, హిందూ మతానికి వ్యతిరేకంగా వారు చేసే ప్రతీ ప్రకటన చాలా చక్కగా ఆలోచించబడింది. డీఎంకే, కాంగ్రెస్ ఇండి కూటమి మరే ఇతర మతాలను విమర్శించదు. హిందూ మతం విషయానికి వస్తే, అవమానించడానికి ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టదు’’ అని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Arunachal Pradesh: అరుణాచల్ మా దేశంలో విడదీయలేని భాగం.. చైనా వ్యాఖ్యలపై భారత్ ఫైర్..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు కార్యక్రమంలో ‘‘శక్తి’’ని నాశనం చేయాలని, శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ప్రకటించారు. ఇది హిందూ మతాన్ని, హిందూ విశ్వాసాలను పూర్తిగా అవమానించేలా ఉందని ప్రధాని ఫైర్ అయ్యారు. మధుర మీనాక్షి, కంచి కామాక్షి తమిళనాడులో శక్తి స్వరూపాలని, శక్తిని ధ్వంసం చేస్తామని కాంగ్రెస్, డీఎంకే కూటమి అంటున్నాయని, హిందూ మతంలో శక్తి అంటే మాతాశక్తి, నారీ శక్తి అని ప్రధాని అన్నారు. ఇండి కూటమి మహిళల విషయంలో ఎలాగ ప్రవర్తిస్తున్నారో అందరూ చూస్తున్నారని ఆయన అన్నారు. మహిళల పట్ల ఇండియా కూటమి వ్యవహరించే శైలికి మీ అందరూ సాక్ష్యమని, రాష్ట్ర మాజీ సీఎం జయలలిత జీవించి ఉన్నప్పుడు డీఎంకే నాయకులు ఆమెతో ఎలా ప్రవర్తించారో అందరీ తెలుసని, ఇది డీఎంకే అసలు రూపమని ఆయన అన్నారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు నాణేనికి రెండు వైపులని ప్రధాని ఆరోపించారు.

డీఎంకే, కాంగ్రెస్ అంటే అవినీతి, కుటుంబ పాలన అని, కాంగ్రెస్‌ని వదిలించుకున్నాక దేశం 5జీ టెక్నాలజీకి చేరుకుంది, కానీ తమిళనాడులో డీఎంకే సొంతగా 5జీ-వన్‌ను నడుపుతోందని, వారి కుటుంబ ఐదో తరం తమిళనాడుపై నియంత్రణ కలిగి ఉందని విమర్శించారు. భారతదేశం ఏర్పాటు చేస్తు్న్న డిఫెన్స్ కారిడార్‌లలో ఒకటి తమిళనాడులోనే ఉందని, బీజేపీ తమిళనాడు డెవలప్మెంట్‌కి ఏ అవకాశాన్ని వదలడం లేదని, తమిళనాడు మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఉచిత రేషన్ నుంచి ముద్రా యోజన దాకా హామీలను అందించామన ప్రధాని అన్నారు.