NTV Telugu Site icon

Congress: కాంగ్రెస్ వేదికపైనే మహిళా నేతకి లైంగిక వేధింపులు..

Congress

Congress

Congress: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తు్న్న కార్యక్రమం సభా వేదికపైనే ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపులకు గురైంది. పార్టీ సీనియర్ నేత దీపేందర్ హుడా సమక్షంలోనే హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలు పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు సెల్జా కుమారి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత తాను బాధిత మహిళతో మాట్లాడానని, ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో తాను వేధింపులకు గురైనట్లు సదరు మహిళ చెప్పారని తెలిపారు. ఏ పార్టీ అయినా కూడా ఏ మహిళని అగౌరపరచకూడదని ఆమె అన్నారు.

Read Also: Jeep Compass: జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ రిలీజ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఈ ఘటనని ఖండించారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘చాలా దిగ్భ్రాంతికరమైనది! దీపేంద్ర హుడా సమక్షంలోనే వేదికపైనే ఓ మహిళా కాంగ్రెస్ నేతపై కాంగ్రెస్ నేతలు వేధింపులకు పాల్పడ్డారు.దీనిని కాంగ్రెస్ ఎంపీ సెల్జా కుమారి కూడా ధృవీకరించారు. పగటిపూట పూర్తిగా ప్రజల మధ్య సమావేశాల్లో మహిళలు సురక్షితంగా లేరంటే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు సురక్షితంగా ఉండగలరా..?’’ అని ప్రశ్నించారు. సిమిజాన్, శారదా రాథోడ్, రాధికా ఖేరా వంటి చాలా మంది మహిళా కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీలోని నాయకులచే వేధింపులకు గురయ్యారని, ‘‘కాస్టింగ్ కౌచ్’’ సంస్కృతి గురించి ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని పూనావాలా ప్రశ్నించారు.

Show comments