NTV Telugu Site icon

Uttar Pradesh: కూతురు పెళ్లి కోసం పొదుపు చేస్తే.. రూ.18 లక్షలను మాయం చేసిన చెదలు..

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: కూతురు పెళ్లి కోసం ఓ తల్లి దాచుకున్న డబ్బులన్నీ చెదలు పట్టాయి. ఏకంగా రూ.18 లక్షలని చెదలు మాయం చేశాయి. ఒక్క రూపాయి కూడా లేకుండా చెదలు మొత్తం డబ్బుల్ని కొట్టాయి. అయితే ఇదంతా బాధితురాలు ఇంట్లో కాదు. బ్యాంకు లాకర్ లో ఉన్న డబ్బులకు చెదలు పట్టాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొరాదాబాద్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళ్లే మొరాదాబాద్ కి చెందిన అల్కా పాఠక్ గతేడాది అక్టోబర్ నెలలో బ్యాంకు ఆఫ్ బరోడా ఆషియానా బ్రాంచులో తన లాకర్ లో రూ.18 లక్షలు ఉంచింది. అయితే ఇటీవల లాకర్ అగ్రిమెంట్ రిన్యూవల్ చేసుకోవడానికి బ్యాంకుకి రావాల్సిందిగా బ్యాంకు అధికారులు ఆమెను కోరారు. ఈ నేపథ్యంలో తన లాకర్‌లో అన్నీ కరెక్టుగా ఉన్నాయో లేదో అని చెక్ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also: Punjab: వ్యక్తి కడుపులో ఇయర్ ఫోన్స్, తాళాలు.. అవాక్కైన వైద్యులు..

తన కూతురు పెళ్లి కోసం ఎంతో కష్టపడి పొదుపు చేసిన డబ్బు దుమ్ముగా మారిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో బ్యాంకు అధికారులు కూడా షాక్ కి గురయ్యారు. ఈ ఉదంతంపై బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపినట్లు తెలిపారు. అయితే బ్యాంకు అధికారులు తనతో ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పాఠక్ ఆరోపించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుంటే మీడియాకు ఎక్కుతానని చెప్పారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

నిజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం.. బ్యాంకు లాకర్లలో ఎలాంటి నగదును నిల్వ ఉంచకూడదు. బ్యాంకు ఒప్పందంలో ‘‘ నగలు, విలువైన వస్తువులు, పత్రాలు ఉంచడానికి మాత్రమే లాకర్ ని ఉపయోగించాలి, కానీ నగదు లేదా కరెన్సీ నిల్వ చేయడానికి కాదు’’ అని నిబంధలను పేర్కొన్నాయి. దొంగతనం, దోపిడి కారణంగా లాకర్ లోని వస్తువులు కోల్పోతే , అగ్నిప్రమాదం, భవనాలు కూలిపోయినప్పుడు, మోసం జరిగినప్పుడు మాత్రమే లాకర్ కి ఏడాదికి చెల్లించే మొత్తానికి 100 రెట్లు పరిహారం ఇస్తుందని, బ్యాంక్ బాధ్యత వహిస్తుందని బ్యాంక్ వెబ్‌సైట్ పేర్కొంది.