NTV Telugu Site icon

Tamil Nadu: కొడుకు చదువు కోసం చావుకు సిద్ధమైంది..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: కొడుకును ఉన్నత చదువు చదివించడం కోసం ఆ మహిళ చావుకు సిద్ధమైంది. కొడుకు కాలేజీ ఫీజు కట్టేందుకు పరిహారం కోసం బస్సు ముందుకు దూకిన ఆ మహిళ మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. తమిళనాడులోని సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఒక మహిళ, తన కొడుకు భవిష్యత్తు కోసం తమిళనాడు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోసం కదులుతున్న బస్సు ముందు దూకింది. జూన్ 28న ఈ ఘటన జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read also: Sangareddy: గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు అస్వస్థత.. వాంతులు విరోచనాలు

జూన్‌ 28న సేలంలో 45 సంవత్సరాల వయస్సు గల పాపాతి తన కొడుకు కాలేజీ ఫీజు చెల్లించడం కోసం స్పీడ్‌గా వెళుతున్న బస్సు కింద పడి మరణించారు. ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పరిహారం వస్తుందని ఎవరో చెప్పడంతో .. ఆ మహిళ ఇంతటి తీవ్రమైన చర్యకు పాల్పడట్టు తెలుస్తోంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఘటన జరిగిన సమయం కంటే ముందు పాపాతి బస్సు ముందు దూకడానికి ప్రయత్నం చేసినట్టు తెలిపారు. అయితే ఆమెను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో కొద్దిసేపటి తర్వాత.. ఆమె రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తూ మరొక బస్సు ముందు దూకడం కనిపించిందని.. ఫలితంగా ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. కొడుకు కాలేజీ ఫీజు కట్టలేక పాపాతి డిప్రెషన్‌తో పోరాడుతోందని బంధువులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని ఆమెను ఎవరో తప్పుదోవ పట్టించడంతో పాపాతి ఈ దుశ్చర్యకు పాల్పడింది. భర్త నుంచి విడిపోయిన పాపాతి.. గత 15 ఏళ్లుగా తన పిల్లలను తానే ఒంటరిగా పెంచుతోంది.