NTV Telugu Site icon

Shashi Tharoor: కేంద్రమంత్రితో శశిథరూర్ సెల్ఫీ.. కాంగ్రెస్‌కి క్లియర్ మెసేజ్..

Shashi Tharoor

Shashi Tharoor

Shashi Tharoor: కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ వ్యవహారం ఆ పార్టీలో కాకరేపుతోంది. రేపోమాపో ఆయన హస్తం పార్టీకి గుడ్ బై చెబుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే కాంగ్రెస్ పార్టీకి థరూర్ సిగ్నల్స్ పంపుతున్నారు. తాజాగా, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌తో శశిథరూర్ సెల్ఫీ దిగడం కాంగ్రెస్‌కి స్పష్టమైన మెసేజ్‌ని పంపింది. భారతదేశం-యుకె వాణిజ్య ఒప్పందంపై చర్చ తర్వాత కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ మరియు బ్రిటిష్ వాణిజ్య విదేశాంగ కార్యదర్శి జోనాథన్ రేనాల్డ్స్‌తో థరూర్ సెల్ఫీ దిగారు. దీనిని మంగళవారం ఉదయం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Read Also: Solar Manufacturing: సోలార్ తయారీని పెంచడానికి 1 బిలియన్ డాలర్ల సబ్సిడీకి భారత్ ప్లాన్‌..!

‘‘భారత్ వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్‌తో కలిసి బ్రిటన్ వ్యాపార మరియు వాణిజ్య కార్యదర్శి జోనాథన్ రేనాల్డ్స్‌తో చర్చించడం చాలా ఆనందంగా ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన FTA చర్చలు పునరుద్ధరించబడ్డాయి. ఇది చాలా స్వాగించాల్సిన అంశం’’ అని థరూర్ కామెంట్స్ చేశారు.

ఇటీవల, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ కావడాన్ని ఆయన ప్రశంసించారు. ఇదే విధంగా కేరళలోని పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ ప్రభుత్వంపై కూడా ప్రశంసలు కురిపించారు. ఈ వ్యవహారాలపై థరూర్‌పై కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. ఇదే కాకుండా, ఒక పాడ్ కాస్ట్‌లో థరూర్ మాట్లాడుతూ.. ‘‘”పార్టీ నన్ను కోరుకుంటే… నేను అక్కడే ఉంటాను. లేకపోతే, నాకు నా స్వంత పనులు ఉన్నాయి. నాకు వేరే ఆప్షన్స్ లేవని మీరు అనుకోకూడదు…” అని అన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.