Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్‌నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..

  • ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్‌నా?’’..
  • రాహుల్ గాంధీ వియత్నాం ట్రిప్‌పై శశిథరూర్ సమాధానం..
Shshi Tharoor

Shshi Tharoor

Rahul Gandhi Vietnam Trip:  కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వియత్నాం పర్యటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దేశాన్ని అస్థిరపరిచేందుకు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లాడని బీజేపీ ఆరోపిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లడంపై బీజేపీ విమర్శలు చేస్తోంది.

ఇదిలా ఉంటే, రాహుల్ విదేశీ పర్యటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ప్రశ్నించగా.. ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్‌నా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. తాను ట్రావెట్ ఏజెంట్‌ను కాదని, ఈ ప్రశ్న తనను అడగడంలో అర్థం లేదని అన్నారు.

రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. బీజేపీ నేత సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. జార్జ్ సోరోస్ నుంచి కోచింగ్ తీసుకోవడానికి ఆయన వియత్నాం వెళ్లారని, భారత్‌లో ప్రభుత్వ మార్పుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భారత్‌ను అస్థిరపరిచే వ్యక్తుల్ని కలిసేందుకు రాహుల్ విదేశాలకు వెళ్లారా అని మరో బీజేపీ నేత ప్రదీప్ భండారీ ప్రశ్నించారు.