Site icon NTV Telugu

Shashi Tharoor: మోడీ మంచి అవకాశాన్ని కోల్పోయారు.. శాంతి సదస్సుకు వెళ్లకపోవడాన్ని తప్పుపట్టిన శశిథరూర్

Shashi Tharoor

Shashi Tharoor

గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకాకపోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుపట్టారు. శాంతి సదస్సుకు రావాలని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు, ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు. కానీ మోడీ వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం సరైంది కాదని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ‘‘వ్యూహాత్మక సంయమనమా లేదా అవకాశాన్ని కోల్పోయారా?’’ అని ప్రశ్నించారు. పొరుగు ప్రాంతంలో జరిగే భద్రతా శిఖరాగ్ర సమావేశానికి మోడీ హాజరు కాకూడదనే నిర్ణయం తనను తాను ‘‘ఆశ్చర్యపరిచిందని’’ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Meloni: ట్రంప్ శాంతికర్త అంటూ షెహబాజ్ షరీఫ్ పొగడ్తలు.. మెలోని సంజ్ఞలు వైరల్

ఇక గాజా శిఖరాగ్ర సదస్సులో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్-ట్రంప్ చాలా సేపు ముచ్చటించారు. చేతిలో చేయి వేసుకుని సంభాషించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. అయితే ఇలాంటి మంచి అవకాశాన్ని మోడీ కోల్పోయారని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ను పంపించారు. ఇలా ఒక వ్యక్తిని పంపండం వల్ల దేశం ఫోకస్ కాదని తెలిపారు.

ఇది కూడా చదవండి: Trump: మోడీ మంచి స్నేహితుడు.. గాజా శాంతి సదస్సులో ట్రంప్ ప్రశంసలు

ఇక గాజాలో కాల్పుల విరమణను ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్వాగతించారు. బందీలను విడుదల చేయడాన్ని ప్రశంసించారు. ట్రంప్-నెతన్యాహు ప్రయత్నాలను కొనియాడారు. పశ్చిమాసియాలో శాంతిని తీసుకురావడానికి కృషి చేసిన ట్రంప్‌ను మోడీ అభినందించారు.

షర్మ్ ఎల్-షేక్ సమావేశానికి ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇటాలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హాజరయ్యారు.

ఇక సోమవారం 20 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. అలాగే 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇక ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఎంపీలంతా అభినందించారు.

Exit mobile version