Shashi Tharoor: కేంద్ర బడ్జెట్ పై శశి థరూర్ రియాక్షన్.. కేరళకు తీవ్ర అన్యాయం చేశారంటూ ఆగ్రహం..
- కేంద్ర బడ్జెట్ 2026 మండిపడుతున్న విపక్షాలు..
- బడ్జెట్‌లో కేరళకు తీవ్ర అన్యాయం జరిగింది..
- మౌలిక వసతుల ప్రస్తావనల్లో కేరళకు చోటు దక్కలేదు: శశిథరూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: కేంద్ర బడ్జెట్ 2026ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన అనంతరం ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్ అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ థరూర్.. నౌకాశ్రయాల సిద్ధీకరణ (షిప్ ప్రిపరేషన్), కనెక్టివిటీ అంశాల చర్చలో పాట్నా, వారణాసి వంటి నగరాల పేర్లు ప్రస్తావించారు.. కానీ, భారత్‌లో “అతి పెద్ది అయినా కేరళ గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మౌలిక వసతుల ప్రస్తావనల్లో కేరళకు చోటు దక్కకపోవడం “ఆశ్చర్యకరం” కలిగించిందని శనిథరూర్ అన్నారు.
Read Also: Niharika : బయటికి కనిపించడం లేదు కానీ.. గుండెల్లో చాలా బరువుని మోస్తున్నా..
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
ప్రతిపక్షాల రియాక్షన్:
* సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బడ్జెట్‌పై ఘాటైన విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ పేదల వాస్తవ పరిస్థితులకు పూర్తిగా దూరంగా ఉందని వ్యాఖ్యానించారు. “విద్య లేకుండా వికసిత్ భారత్ ఎలా సాధ్యమవుతుంది? అని ప్రశ్నించారు.
* తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ బడ్జెట్‌ను పూర్తిగా తిరస్కరించారు. ఈ బడ్జెట్‌లో కొత్తదనం ఏమీ లేదు.. గత పథకాలనే పునరావృతం చేశారని ఆరోపించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌కు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు దక్కలేదని విమర్శించారు.
Read Also: Rupee Breakup: ప్రభుత్వానికి రూపాయి ఎలా వస్తోంది? ఎటు పోతోంది? పూర్తి వివరాలు ఇవే!
పన్ను సడలింపులపై ప్రభుత్వ హైలైట్స్:
పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీవన సౌలభ్యం పెంచడం, పన్ను చెల్లింపుల ప్రక్రియను సరళీకరించడం లక్ష్యంగా పలు పన్ను సంస్కరణలను ప్రకటించారు. ఆదాయపన్ను వ్యవస్థను మరింత సులభంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ద్వారా సహజ వ్యక్తికి లభించే వడ్డీ ఆదాయాన్ని ఇకపై ఆదాయపన్ను నుంచి మినహాయించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం రోడ్డు ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు మేలు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే, విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ (Tax Collection at Source) ను ప్రస్తుతం ఉన్న 5 నుంచి 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. దీనికి ఎలాంటి మొత్త పరిమితి లేకుండా ఈ సడలింపు వర్తిస్తుందని ఆర్థిక మంత్రి సీతారామన్ వివరించారు. మొత్తంగా కేంద్ర బడ్జెట్ 2026 రాజకీయంగా తీవ్ర చర్చలకు దారి తీసింది. ప్రతిపక్షాలు ప్రాంతీయ సమానత్వం, విద్య, సంక్షేమంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతుండగా.. ప్రభుత్వం మాత్రం పన్ను సడలింపులు, సులభతర వ్యవస్థలపై దృష్టి పెట్టినట్లు స్పష్టం చేస్తుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?