Shashi Tharoor Comments on Mallikarjun kharge: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అనేక రాజకీయ పరిణామాాల మధ్య అధ్యక్ష బరిలో మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్ ఉన్నారు. ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నిక ఏకభిప్రాయంతో కావాలని.. ఈ విషయాన్ని శశిథరూర్ కు చెప్పానని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు శశిథరూర్ కూడా తన ప్రచారాన్ని ప్రారంభించారు. మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీలో మార్పలు తీసుకురాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ టాప్ 3 లీడర్లలో ఒకరని.. ఆయనలాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో మార్పును తీసుకురాలేరని.. ఇప్పుడున్న వ్యవస్థనే కొనసాగిస్తారని శశిథరూర్ అన్నారు. మేం ఇద్దరం శతృవులం కాదని.. పాతికేళ్లు తరువాత పార్టీ అత్యున్నత పదవికి పోటీ పడుతున్న పోటీదారులం అని ఆయన అన్నారు. ఇది మా ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం కానది అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: CM KCR: డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగసభ.. భారత రాష్ట్రసమితి వైపే మొగ్గు
అధ్యక్ష ఎన్నిక మా పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం అని.. ఖర్గే వంటి నేతలు మార్పును తీసుకురాలేరని.. పార్టీ కార్యకర్తల అంచానాలకు అనుగుణంగా నేను మాత్రమే మార్పును తీసుకువస్తానని ఆయన అన్నారు. అంతకుముందు మల్లికార్జున ఖర్గేతో ఓపెన్ డిబెట్ కు సిద్ధం అని థరూర్ అన్నారు. ఇద్దరి మధ్య సైద్ధాంతిక విభేదాలు లేకున్నా.. అనుకున్న లక్ష్యాలను ఎలా సాధించాలనేది ప్రశ్న అని అన్నారు. నామినేషన్ సమర్పణ, ఎన్నికల మధ్య కేవలం రెండు వారాలే సమయంల ఉన్నందువల్ల 9000 మంది కాంగ్రెస్ ప్రతినిధులను కలవడం కష్టమని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే మల్లికార్జున ఖర్గేకు ఇప్పటికే 30 మంది కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. దీంటో జీ 23నేతలు కూడా ఉన్నారు. మా పార్టీలో జీ-23 లేదని..బీజేపీ-ఆర్ఎస్ఎస్ ని ఎదుర్కొనేందుకు అందరం ఐక్యంగా పోరాడతామని ఖర్గే అన్నారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 19న ఫలితాలు రానున్నాయి. దాదాపుగా రెండు దశాబ్ధాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు రాబోతున్నాడు.
