Site icon NTV Telugu

CWC meeting: సీడబ్ల్యూసీ మీటింగ్‌కు హాజరైన శశిథరూర్.. వీడియోలు వైరల్

Cwc1

Cwc1

ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో సీడబ్ల్యూసీ మీటింగ్‌ ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ‌తో పాటు పాటు ఇతర సీనియర్ నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హాజరయ్యారు. ఇక ఈ సమావేశానికి శశిథరూర్ హాజరు కావడం ప్రత్యేక ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇక ఈ మీటింగ్‌లో ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై ప్రధానంగా చర్చించనున్నారు.

శశిథరూర్.. కేరళలోని తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎక్కువగా బీజేపీ నేతలతో కలిసి ఉంటుంటారు. వారితో కలిసి ఉంటూ కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఉంటారు. దీంతో కాంగ్రెస్‌తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆ మధ్య కాంగ్రెస్ నిర్వహించిన ఏ కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. తాజాగా శనివారం జరుగుతున్న సీడబ్ల్యూసీ మీటింగ్‌కు మాత్రం హాజరై స్పెషల్ ఎంట్రాక్షన్‌గా నిలిచారు.

ఇది కూడా చదవండి: Thailand-Cambodia war: థాయ్‌లాండ్-కంబోడియా మధ్య కుదిరిన శాంతి ఒప్పందం.. ఉద్రిక్తతలకు ఫుల్‌స్టాప్

ఇదిలా ఉంటే ఆదివారం (డిసెంబర్ 28) కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా
దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ చిత్రపటాలతో మండల, గ్రామస్థాయిల్లో పీసీసీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘పని చేసే హక్కు, శ్రమ గౌరవం, సమాజిక న్యాయం’’ పేరుతో ఆందోళనలు, నిరసనలు తెలపనున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉపాధి హామీ పథకం పేరును ‘జీ రామ్ జీ’గా మార్చారు. అప్పుడే కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ నిరసన తెలిపింది. రేపు దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.

Exit mobile version