NTV Telugu Site icon

Maharashtra polls: సీఎం పోస్టుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

Maharashtrapolls

Maharashtrapolls

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వసన్నద్ధం అవుతున్నాయి. ఓ వైపు ఎన్డీఏ కూటమి.. ఇంకో వైపు ఇండియా కూటమి పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అయితే ఎన్నికలకు వెళ్లే ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే ఈ అంశంపై NCP-SCP నాయకుడు శరద్ పవార్ మాట్లాడుతూ.. తమ పార్టీలో ఎవరికీ ఆసక్తిలేదని తేల్చేశారు. రాష్ట్రానికి సుపరిపాలన అందించాలని భావిస్తున్నామని.. మార్పు రావాలని కోరుకుంటున్నామని.. కాబట్టి సీఎం ఎవరవుతారన్నది తమ ప్రశ్న కాదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Sri Lanka-New Zealand: శ్రీలంక-న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ 6 రోజులు.. కారణమేంటంటే..?

ఇక ఉద్ధవ్ థాకరే కూడా ఇటీవల స్పందిస్తూ ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించినా అభ్యంతరం లేదని.. సపోర్టు చేస్తామని తెలిపారు. మొత్తానికి ఇండియా కూటమిలో సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇటీవలే ఉద్ధవ్ థాకరే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను కలిసి వచ్చారు. సీట్ల పంపకాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Pak Army: సాంకేతిక లోపం కారణంగా పాక్ లోకి ప్రవేశించిన భారత్ డ్రోన్.. పాక్ సైన్యం ఏం చేసిందంటే?

వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడమే తమ లక్ష్యమని శరద్ పవార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్పు జరగగానే సుపరిపాలన అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇక మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేలే.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పుకొచ్చారు. ఇక ఎంఐఎం కూడా ఇండియా కూటమిలో చేరేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ముస్లిం ఓట్లు కూడా అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మజ్లి్స్ సపోర్టుతో ఇండియా కూటమి పోటీ చేయనుంది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. అదే జోష్.. అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించాలని భావిస్తోంది.