NTV Telugu Site icon

Rahul Gandhi: ‘‘సిగ్గు చేటు’’.. ఆర్మీ అధికాలపై దాడి, గర్ల్‌ఫ్రెండ్‌పై గ్యాంగ్ రేప్‌పై రాహుల్ ఫైర్..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులు, వారి ఇద్దరు మహిళా స్నేహితులపై జరిగిన దాడి ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఇద్దరు అధికారులను కొట్టడమే కాకుండా, వారి గర్ల్ ఫ్రెండ్స్‌లో ఒకరిపై సామూహిక అత్యాచారం జరిగింది. తుపాకీ గురిపెట్టి సదరు బాధితురాలిపై అత్యాచారం జరిపినట్లు తెలిసింది. ఈ ఘటనపై కాంగ్రెస్ విరుచుకుపడింది. బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది.

‘‘ మధ్యప్రదేశ్‌లో ఇద్దరు ఆర్మీ సిబ్బందిపై జరిగిన హింస, వారి సహచరిపై అత్యాచారం మొత్తం సమాజం సిగ్గుపడేలా చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు దాదాపుగా లేవు. రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న నేరాల పట్ల బీజేపీ ప్రతికూల వైఖరి చాలా ఆందోళన కలిగిస్తుంది. భయం లేకుండా నేరస్తులు తిరగడం పరిపాలన వైఫల్యాన్ని తెలియజేస్తుంది. దేశంలో పెరుగుతున్న అసురక్షిత వాతావరణ దేశంలో మహిళల స్వేచ్ఛ, ఆంకాక్షలను పరిమితం చేస్తోంది. సమాజం, ప్రభుత్వం రెండూ సిగ్గుతో తలదించుకుని సీరియస్‌గా ఆలోచించాలి. దేశ జనాభాలో సగభాగాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఎంత కాలం కళ్లు మూసుకుంటుంది’’ అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: IC 814 hijack: ఉగ్రవాదుల్ని విడుదల చేయొద్దని బీజేపీకి చెప్పా.. హైజాక్ ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా..

ప్రియాంకా గాంధీ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తి చేశారు. ‘‘ మధ్యప్రదేశ్‌లో ఆర్మీ అధికారులను బందీలుగా పట్టుకుని ఓ మహిళపై సామూహిక అత్యాచారం, ఉత్తర్ ప్రదేశ్ నడిరోడ్డుపై నగ్నంగా మహిళ మృతదేశం లభ్యమైన ఘటనలు హృదయవిదారకంగా ఉన్నాయి. దేశంలో ప్రతిరోజు 86 మంది మహిళలు అత్యాచారాలు, క్రూరత్వాలకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయట, వీధి నుంచి ఆఫీసు వరకు ఎక్కడా మహిళలకు భద్రత లేదు. దేశంలోని సగం జనాభా అసురక్షితంగా ఉండటమే కాదు, ఇలాంటి అనాగరికత వల్ల ప్రతిరోజూ కోట్లాది మంది మహిళలు తమ ధైర్యాన్ని కోల్పోతున్నారు. ప్రధానమంత్రి మహిళల భద్రత గురించి పెద్దగా మాట్లాడుతున్నారు కానీ దేశవ్యాప్తంగా మహిళలు తమ భద్రత కోసం తీవ్రమైన ప్రయత్నం కోసం ఎదురుచూస్తున్నారు. చివరకు ఈ నిరీక్షణ ఎప్పుడు ముగుస్తుంది?’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

ఏం జరిగిందంటే.?

ఇద్దరు ఆర్మీ అధికారులు తమ స్నేహితురాళ్లతో కలిసి పిక్నిక్ వెళ్లారు. మంగళవారం అర్థరాత్రి 8 మంది నేరస్తుల ముఠా వారిపై దాడి చేశారు. అధికారులు, వారి స్నేహితురాళ్లు ఛోటీ జామ్‌ ఫైరింగ్ రేంజ్ సమీపంలో ఉన్నప్పుడు తుపాకీ, కత్తులతో వారిని చుట్టుముట్టారు. అధికారి, మరో యువతిని బందీగా తీసుకుని మిగిలి ఇద్దరిని రూ. 10 లక్షల డబ్బును తీసుకురావాలని పంపారు. విడుదలైన ఇద్దరు అధికారులకు విషయాన్ని చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి రావడం చూసి దుండగులు పారిపోయారు. యువతిపై ముఠా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వైద్య పరీక్షల్లో తెలిసింది. ఇద్దరు నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.