NTV Telugu Site icon

Uttar Pradesh: ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్‌తో ఏడుగురు మృతి

Electrick Shock Incident

Electrick Shock Incident

Seven people died due to electric shock in Uttar Pradesh: అంతవరకు ఉత్సాహంగా జరిగిన ఊరేగింపు ఒక్కసారిగా విషాదంగా మారింది. కరెంట్ షాక్ తో ఏడుగురు మరణించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ లో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు నాన్ పరా స్థలంలో మసూపూర్ గ్రామంలో గ్రామస్తులు బరాఫవత్​ ఊరేగింపు వేడుకకు ఓ వాహనంలో బయలుదేరారు. ఇలా ఉరేగింపుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం కరెంట్ షాక్ కు గురైంది.

Read Also: Asaduddin Owaisi: సీవీ, సీపీ ఆనంద్ పై అసదుద్దీన్‌ ఒవైసీ ఫైర్‌

అయితే వాహనంలో ఓ ఇనుపరాడ్ ఉంది. వాహనం వెళ్లే సమయంలో హైటెన్షన్ కరెంట్ వైర్లు వాహనంలో ఉన్న ఇనుపరాడ్ కు తగిలాయి. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు కరెంట్ షాక్ కు గురయ్యారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా.. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. కరెంట్ షాక్ వల్ల పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జిల్లా రూరల్ ఎస్పీ అశోక్ కుమార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ స్పందించారు. గాయపడిన వారికి మెరగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Show comments