పంజాబ్‌లోని లుథియానాలో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో చెలరేగిన మంటల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరణించిన వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. లూథియానాలోని టిబ్బా రోడ్డులో మున్సిపల్ డంప్ యార్డుకు సమీపంలో గల గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది.
తెల్లవారుజామున 3 గంటలకు గుడిసెకు నిప్పు అంటుకున్న విషయంపై స్థానికులు తమకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశామని అగ్నిమాపక అధికారి ఆతీష్ రాయ్ చెప్పారు. అయితే గుడిసెకు ఎలా నిప్పు అంటుకుందనే విషయమై తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మృతుల్లో నలుగురు అమ్మాయిలు, రెండేళ్ల అబ్బాయి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను సురేష్ షని(55) రానా దేవి(50), రాఖీ కుమారి(15), మనీషా కుమారి(10), చందా కుమారి(8), గీతా కుమారి(6), సన్నీ(2)గా గుర్తించామన్నారు.
Sri Lanka Economic crisis: తారాస్థాయికి నిత్యావసరాల ధరలు.. కిలో బియ్యం రూ.440..
