అమెరికా రాయబారి సెర్గియో గోర్ సామాన్యుడిలా మారిపోయారు. బెంగళూరు నగర వీధుల్లో ఉల్లాసంగా… ఉత్సాహంగా గడిపారు. ఆటోలో తిరుగుతూ.. హోటల్‌లో మసాలా దోశ తింటూ.. స్ట్రాంగ్ కాఫీ తాగుతూ ఖుషి.. ఖుషిగా గడిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: US: అమెరికా పాఠశాల హాకీ ఆటలో కాల్పులు.. ముగ్గురు మృతి
భారత్‌లో అమెరికా రాయబారి అయిన సెర్గియో గోర్ బెంగళూరులో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యతో కలిసి ఆటోలో తిరుగుతూ ఇందిరానగర్‌లో మసాలా దోశ, స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ సేవించారు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు అమెరికా రాయబారిని ఘనంగా స్వాగతించామని బీజేపీ ఎంపీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Trump: ‘‘దాచడానికి ఏముంది?’’ ఎప్‌స్టీన్‌తో ఎలాంటి సంబంధం లేదన్న ట్రంప్
బెంగళూరు 700కి పైగా అమెరికన్ కంపెనీలకు ఆతిథ్యం ఇస్తుందని.. సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో దాదాపు 43 శాతం వాటాను కలిగి ఉందని ఎంపీ పేర్కొన్నారు. అదనంగా భారతదేశంలోని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లలో దాదాపు 40 శాతం బెంగళూరు నుంచి పనిచేస్తున్నాయని తేజస్వి సూర్య తెలిపారు. ఇక తేజస్వి సూర్య ఆతిథ్యానికి సెర్గియో గోర్ కూడా ముగ్థులయ్యారు. చాలా బాగుంది అంటూ ప్రశంసించారు.
Delighted to welcome H.E. Sergio Gor, U.S. Ambassador to India, to Bengaluru today.
Over some masala dosa & strong coffee at Filter Coffee, Indiranagar, we had an engaging conversation on the growing India US partnership, especially in trade, technology and innovation following… pic.twitter.com/we2jautGId
— Tejasvi Surya (@Tejasvi_Surya) February 16, 2026
Ambassador Sergio Gor brings uncommon energy and dynamism to diplomacy, and a true belief in India-US’s limitless potential.
A late-night Namma Auto ride is the real Bengaluru experience.
Thank you for an inspiring conversation and for believing in our great shared future.… https://t.co/gHxO9KlbKx pic.twitter.com/iPxHybAYcV
— Tejasvi Surya (@Tejasvi_Surya) February 16, 2026
Just arrived in Bengaluru! From startups to street food, Bengaluru’s energy is unmatched! Thank you to my great host @Tejasvi_Surya pic.twitter.com/9PsRfvKeGI
— Ambassador Sergio Gor (@USAmbIndia) February 16, 2026
