NTV Telugu Site icon

Maharashtra: మహారాష్ట్ర సీఎం ఎవరు..? ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..

Maharashtra Cm

Maharashtra Cm

Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సత్తా చాటింది. రాష్ట్రంలో ఘన విజయం దిశగా వెళ్తోంది. మహాయుతిలోని బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీలు భారీ విజాయాన్ని అందుకున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కూటమి 220కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 125 సీట్లలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.

Read Also: Jayamangala VenkataRamana: వైసీపీకి బిగ్‌షాక్‌.. పార్టీకి మరో ఎమ్మెల్సీ గుడ్‌బై..

ఇదిలా ఉంటే, తాజాగా బీజేపీ కూటమి విజయం ఖరారవుతున్న సందర్భంలో మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకే పదవి లభిస్తుందా..? లేదా దేవేంద్ర ఫడ్నవీస్‌కి సీఎం పదవి వస్తుందా.? అనే ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి పదవిపై ప్రస్తుత సీఎం షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకే సీఎం సీటు ఇవ్వాలనే రూలేం లేదు. అంతిమ ఫలితాలు రానివ్వండి.. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినట్లే, మూడు పార్టీల నేతలు సమావేశమై నిర్ణయం తీసుకుంటాం. మా అగ్రనేతలు మోడీ, అమిత్ షాలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు. మేం చేసిన అభివృద్ధిని చూసి మా కూటమికి పట్టం కట్టారని షిండే అన్నారు. ఒక వైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధిని చేశామని అన్నారు.