Senior BJP Leader Compares Girls In Dirty Clothes To Demoness: కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ బీజేపీ నేత కైలాశ్ విజయవర్గియా మహిళల దుస్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డర్టీ దుస్తుల్లో అమ్మాయిలు రామాయణంలోని శూర్పణఖలా కనిపిస్తారని వ్యాఖ్యానించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఇండోర్‌లో నిర్వహించిన ఓ వేడుకకు హాజరైన ఆయన.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాత్రి సమయాల్లో మద్యం మత్తులో ఉన్న అమ్మాయిల్ని చూస్తే.. నాలుగైదు చెంపదెబ్బలు లాగించాలన్న కోపం వస్తుందని చెప్పారు. ఇక డర్టీ దుస్తుల్లో వారిని చూసినప్పుడు తన కోపం నషాళానికి ఎక్కుతుందంటూ పేర్కొన్నారు.
Omicron Subvariant: కలకలం సృష్టిస్తున్న ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్.. పిల్లల్లో కొత్త లక్షణాలు
భారతదేశంలో మనం ఆడవాళ్లని దేవతలుగా పూజిస్తామని, కానీ వారిలో ఆ లక్షణాలే కనిపించడం లేదని, డర్టీ దుస్తులు వేసుకొని శూర్పణఖలా కనిపిస్తారని కైలాశ్ విజయవర్గియా కుండబద్దలు కొట్టారు. అమ్మాయిలకు దేవుడు మంచి బాడీని ఇచ్చాడని, దాన్ని కప్పుకునేలా మంచి దుస్తులు వేసుకోవాలని సూచించారు. మీ పిల్లలకు మంచి దుస్తులు ధరించాలని సూచించాలంటూ తల్లిదండ్రుల్ని కోరారు. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువల గురించి పిల్లలకు నేర్పించాలన్నారు. ఈ తరం అమ్మాయిల అవతారాలను చూస్తుంటే, తనకు చాలా ఆందోళనగా ఉందన్నారు. దయచేసి.. మంచి దుస్తులు ధరించి, మీ శరీరాన్ని కప్పుకోండని అమ్మాయిల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యానించారంటూ మండిపడుతున్నారు.
Pakistan Crisis: పాకిస్తాన్‌పై మరో పిడుగు.. 2026 కల్లా రూ.63 వేల కోట్లు కట్టకపోతే..
కాంగ్రెస్ స్పోక్స్‌పర్సన్ సంగీత శర్మ స్పందిస్తూ.. ‘‘బీజేపీ నేతలు మహిళలను పదే పదే అవమానిస్తున్నారు. ఇది వారి ఆలోచనలను, వైఖరిని తెలియజేస్తుంది. స్వతంత్ర భారతదేశంలో బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ మహిళలను శూర్పణఖ అని పిలి,చి వారి దుస్తులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరైనది కాదు. దీనిపై బీజేపీ వెంటనే స్పందించి, క్షమాపణలు చెప్పాలి’’ అని కోరారు. నెటిజన్లు సైతం ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తారు. వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.