NTV Telugu Site icon

Uttar Pradesh: కాన్పూర్-ఢిల్లీ హైవేపై నగ్నంగా, తల లేకుండా మహిళ మృతదేహం..

Kanpur Delhi Highway

Kanpur Delhi Highway

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్-ఢిల్లీ హైవేపై నగ్నంగా, తల లేని స్థితిలో మహిళ మృతదేహం కనిపించడం సంచలనంగా మారింది. మహిళ ఎముకలు, దంతాలు విరిగిపోయి ఉన్నాయని యూపీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు విచారణ ప్రారంభించారు. గుజైనిలోని హైవేపై మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. బుధవారం ఈ విషయాన్ని గమనించి స్థానిక పోలీసులు సమాచారం అందించారు.

ఈ కేసులో పోలీసులు ఇంకా పురోగతి సాధించలేదు. మహిళ గుర్తింపుని నిర్ధారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేశం దగ్గర ఎలాంటి మొబైల్ ఫోన్, బ్యాగ్, ఐడీ కార్డు లాంటి ఏం దొరకలేదని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(సౌత్) రవీందర్ కుమార్ తెలిపారు. “మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. శరీరంపై మొద్దుబారిన వస్తువు ఉన్న గుర్తులు ఉన్నాయి. ఈ కేసును హత్యతో పాటు ప్రమాద కోణంలో కూడా విచారిస్తున్నాము” అని డీసీపీ చెప్పారు.

Read Also: Syphilis Virus: ఆ దేశంలో వేగంగా పెరుగుతున్న సిఫిలిస్ వైరస్ కేసులు.. బాధితుల్లో పురుషులు అధికం!

ఈ కేసుని ఛేదించేందుకు పోలీసులు హైవేపై, చుట్టుపక్కట ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళ మరణానికి తక్షణ కారణం స్పష్టంగా తెలియనప్పటికీ, ప్రమాదం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘‘పెద్ద వాహనం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు, దీని వల్లే తల తెగిపోలేదు, గాయం కారణంగా పగిలిపోయింది. బట్టలు కూడా దొరికాయి. పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు వెల్లడవుతాయి’’ అని కాన్పూర్ ఏసీపీ హరీష్ చంద్ర అన్నారు.

అయితే, ఈ ఘటనపై యూపీలో పొలిటికల్ దుమారం చెలరేగింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రతిపక్షాలు యోగి సర్కార్‌పై విమర్శలకు దిగాయి. ‘‘”యుపిలో మహిళలపై జరిగిన మరో హృదయ విదారక సంఘటనలో, కాన్పూర్ హైవేపై తల లేని, నగ్నంగా ఉన్న మహిళ మృతదేహం కనుగొనబడింది. మరణించిన వారిపై క్రూరమైన హింస మరియు అపారమైన శారీరక హింసకు సంబంధించిన సాక్ష్యాలను ప్రస్తావించకూడదని నైతికత చెబుతోంది.” అని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.

Show comments