NTV Telugu Site icon

Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌజ్‌లోకి ఇద్దరు అపరిచితులు..

Salman Khan

Salman Khan

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి చెందిన ఫామ్ హౌజ్ లోకి ఇద్దరు అపరిచిత వ్యక్తులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసుల వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ముంబై సమీపంలోని పన్వేల్‌‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌజ్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. జనవరి 4న ఈ ఘటన జరిగింది. నిందితులను అజేష్‌ కుమార్‌ ఓంప్రకాష్‌ గిల్‌, గురుసేవక్‌ సింగ్‌ తేజ్‌సింగ్‌ సిఖ్‌లు గుర్తించారు.

Read Also: Pakistan Blast: పాకిస్థాన్ లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. 22 మందికి గాయాలు..

అర్పితా ఫామ్‌హౌజ్‌లోని సెక్యూరిటీ గార్డులతో నిందితులు మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ అభిమానులమని, ఆయనను కలిసేందుకు వచ్చామని చెప్పారు. అయితే నిందితులు ఇద్దరూ సెక్యూరిటీకి గార్డులకు తప్పుడు పేర్లను చెప్పారు. ఫామ్ హౌజ్ గోడలు ఎక్కి, గొడపై ఉన్న ముళ్ల తీగలను కత్తిరించి కాంపౌండ్ లోకి దూకాలని ప్రయత్నించారు. వీరి కార్యకలాపాలపై అనుమానం రావడంతో సెక్యూరిటీ గార్డులు పోలీసులకు ఫోన్ చేశారు. అనంతరం నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

‘‘న్యూ పన్వేల్‌లోని వాజ్‌లోని సల్మాన్ ఖాన్ అర్పిత ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు ఇద్దరు వ్యక్తులపై పన్వెల్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. తదుపరి విచారణ జరుగుతోంది’’ అని ఇన్‌స్పెక్టర్ అనిల్ పాటిల్ చెప్పారు. ఇటీవల కాలంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ని టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలోనే అతనికి Y+ భద్రత కల్పించారు. మార్చి 2023లో ఈ ముఠా నుంచి బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పంజాబ్ జైల్లో ఉన్న బిష్ణోయ్, పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాని హత్య చేసిన కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు.