Tamil Nadu: “స్కంధమలై”ని “సికిందర్ మలై”గా మార్చాలి.. కుమారస్వామి ఆలయంపై వివాదం..
- కుమారస్వామి పుణ్యక్షేత్రంపై వివాదం..
- స్కంధమలైని సికిందర్మలైగా మార్చాలని ముస్లింల డిమాండ్..
- 144 సెక్షన్ విధించిన ప్రభుత్వం..
- హిందూ సంఘాలకు, పోలీసులకు మధ్య ఘర్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో మధురై సమీపంలోని కుమారస్వామి దేవాలయం ఉన్న తిరుపరంకుండ్రంపై వివాదం చెలరేగింది. తమిళులు ఎంతో భక్తిగా పూజించే సుబ్రమణ్య స్వామి కొలువుదీరిన కొండని కొందరు ముస్లింలు అపవిత్రం చేశారని హిందూ సంఘాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంల అంతటా పోలీసులు 144 సెక్షన్ విధించారు. మధురై జిల్లాలో మంగళవారం భద్రతను కట్టుదిట్టం చేశారు. హిందూ వ్యతిరేక సమూహాలు, రాష్ట్రం ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు భారీ నిరసన ప్రదర్శనకు ప్లాన్ చేస్తున్న సందర్భంలో ఈ పరిణామాలు ఏర్పడ్డాయి.
Read Also: Health Tips: ఫీవర్తో ఉన్నప్పుడు ఇలా చేస్తున్నారా?.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే?
Also Read
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
తిరపరంకుండ్రం కొండను భక్తులు ‘‘స్కంధమలై’’గా పిలుస్తారు. ఈ కొండ పేరుని ‘‘సికిందర్మలై’’గా మార్చాలంటూ కొన్ని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తుండటంతో వివాదం ప్రారంభమైంది. తిరుపరంకుండ్రం కొండపై కొందరు వ్యక్తులు మాంసాహారం తీసుకున్నట్లుగా చూపిస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో హిందవులు, కుమారస్వామి భక్తుల్లో తీవ్రం ఆగ్రహావేశాలు చెలరేగాయి. ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్నా కూడా డీఎంకే ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుందని హిందూ సంఘాలతో పాటు భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ కొండపై ఒక దర్గా కూడా ఉంది. ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లినందున హిందూమున్నాని అనే సంస్థ నిరసనలకు ప్లాన్ చేసింది. అధికారులు వారికి అనుమతి నిరాకరించినప్పటికీ, నిరసన చేయాలని భావిస్తున్నారు.
మధురై అంతటా శాంతిభద్రతల ఆందోళనలను పేర్కొంటూ అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. గుడి, దర్గా రెండింటిలోనూ భక్తులను దర్శనం చేసుకోకుండా పోలీసులు కొండ ప్రవేశద్వారం వద్ద బారికేడ్లు వేశారు. తేని జిల్లాలసమీపంలోని అండిపట్టి కనవై, ఉసిలం పట్టి తేవర్ విగ్రహ ప్రాంతం, , దిండిగల్ జిల్లా సరిహద్దుకు సమీపంలోని ఉత్తప్పనాయకనూర్, ఎలుమలై జంక్షన్ వంటి కీలక తనిఖీ కేంద్రాల వద్ద కఠినమైన వాహన తనిఖీలు జరిగాయి.
తిరుప్పూర్లో ఉద్రిక్తతలు పెరిగాయి. నిరసన కోసం మధురై చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న హిందూ అనుకూల వర్గాలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై , అధికార డీఎంకే పార్టీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ఆయన ఆరోపించారు. సెక్షన్ 144 ఉన్నప్పటికీ మధురైలో ఒక డీఎంకే నాయకుడు ర్యాలీని ఎలా నిర్వహించారని అన్నామలై ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి