Sabarimala Special Trains: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే మరి కొన్ని ట్రైన్స్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న అధికారులు.. భక్తుల రద్దీ దృష్ట్యా తాజాగా మరో 28 రైళు సర్వీసులను నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మౌలాలి నుంచి కొల్లం, కాచిగూడ నుంచి కొట్టాయం, కాకినాడ టౌన్ నుంచి కొల్లం, నర్సాపుర్ నుంచి కొల్లంకు ఈ ట్రైన్స్ నడపనున్నారు.
Read Also: Yogi Adityanath: సంభాల్ అల్లర్లపై సీఎం యోగి కీలక వ్యాఖ్యలు..
ఇక, డిసెంబర్ 11 నుంచి జనవరి 29 వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో ఈ ట్రైన్ సర్వీసులు అందించనున్నాయి. ఈ రైళ్లకు అడ్వాన్సు బుకింగ్స్ రేపు (డిసెంబర్ 6 ) ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవుతాయని రైల్వే అధికారులు చెప్పుకొచ్చారు. రైళ్ల నంబర్లు, సర్వీసులు అందించే తేదీలు, టైమింగ్స్ తదితర వివరాలను ప్రకటించారు.