Site icon NTV Telugu

PM Modi: ఆదిత్య ఎల్1 సక్సెస్.. ఇస్రో సైంటిస్టులకు ప్రధాని అభినందనలు..

Pm Modi

Pm Modi

PM Modi: ఇస్రో ప్రతిష్టాత్మకం చేపట్టిన ‘ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్’ విజయవంతం అయింది. ఈ రోజు 11.50 గంటలకు పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నింగిలోకి పంపబడింది. భూమి దిగువ కక్ష్యలో ఎల్ 1 శాటిలైట్ ను ప్రవేశపెట్టింది. ఇక్కడ నుంచి నాలుగు నెలలు ప్రయాణించి భూమి, సూర్యుడికి మధ్య ఉండే లాంగ్రేజ్ పాయింట్1(L1)కి చేరనుంది.

ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్రమోడీ ఆనందం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. విశ్వాన్ని బాగా అర్థం చేసుకోవడానికి అవిశ్రాంత ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. ‘‘మొత్తం మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై మంచి అవగాహన పెంపొందించడానికి మా అవిశ్రాంతమైన శాస్త్రీయ ప్రయత్నాలు కొనసాగుతాయి’’ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలకు కాంగ్రెస్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేసింది.

Read Also: Asia Cup 2023: పాక్‌పై పైచేయి సాధించాలంటే ముందుగా అతడిని ఔట్ చేయాలి.. ఏబీ డివిలియర్స్ కామెంట్స్..

చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రో ప్రస్తుతం సూర్యుడిపై అన్వేషణ కోసం ఆదిత్య ఎల్1ని ప్రయోగించింది. 15లక్షల కిలోమీటర్లు నాలుగు నెలలు పాటు ప్రయాణించి స్పేస్ క్రాఫ్ ఎల్1 కక్ష్యకు చేరుకుంటుంది. దాదాపుగా 5 ఏళ్ల పాటు సూర్యుడిపై అధ్యయనం చేస్తుంది. సౌర తుఫానులు, సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి వాటిపై పరిశోధనలు చేస్తుంది. ఫిబ్రవరి చివరి నుంచి ప్రతీరోజూ సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది.

Exit mobile version