NTV Telugu Site icon

Uttar Pradesh: యూపీలో ఢిల్లీ తరహా ఘటన.. పిల్లాడిని ఈడ్చుకెళ్లిన కారు.

Up Incident

Up Incident

Schoolboy Hit By Car, Dragged For 1 km In UP: ఢిల్లీ రోడ్ టెర్రర్ ఘటన మరవక ముందే ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్ పిల్లాడిని ఢీకొట్టిన కారు, ఒక కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. ఉత్తర్ ప్రదేశ్ హర్డోయ్ లో 15 ఏళ్ల స్కూల్ విద్యార్షిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన ఢిల్లీ తరహా ఘటనను పోలిఉంది. శుక్రవారం సాయంత్రం 9వ తరగతి విద్యార్థి కోచింగ్ క్లాసుకు వెళ్తుండగా వ్యాగన్ ఆర్ కారు అతడి సైకిల్ పై నుంచి దూసుకెళ్లింది.

Read Also: Kannababu: మాకు బాలకృష్ణ తక్కువ కాదు.. చిరంజీవి ఎక్కువ కాదు..

ఈ క్రమంలో బాలుడి కాలు కారు వెనక భాగంలో ఇరుక్కుపోయింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కారు డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో బాలుడు కారు వెనక్కి చిక్కుకున్న విషయం తెలియక కారును వేగంగా పోనిచ్చాడు. ఈ సంఘటనను చూసిన వ్యక్తులు కారును వెంబడించి ఆపమని అరవడంతో కారును ఆపాడు. చివరకు రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతానికి చేరుకోగానే జనాలు కారును ఆపి బాలుడిని రక్షించారు. ఈ ఘటన తర్వాత ఆగ్రహించిన జనాలు డ్రైవర్ పై కర్రలతో దాడి చేశారు. కారును ధ్వంసం చేశారు. ప్రస్తుతం గాయాలపాలైన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసిన పోలీసులు జనాల నుంచి కారు డ్రైవర్ ను కాపాడి అదుపులోకి తీసుకున్నాడు.

ఈ వారంలో వాహనాలు ఇలా మనుషులను ఈడ్చుకెళ్లడం ఇది మూడోసారి. న్యూ ఇయర్ రోజున ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలో 20 ఏళ్ల యువతి స్కూటీని ఢికొట్టిన బాలెనో కారు, యువతిని దాదాపుగా 12 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో యువతి శరీరం ఛిద్రం అయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని తర్వాత రెండు రోజుల క్రితం నోయిడాలో ఓ డెలివరీ ఏజెంట్ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టి దాదాపు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో మృతి చెందాడు.