NTV Telugu Site icon

Jharkhand: విద్యార్థిని బట్టలు విప్పించిన టీచర్.. అవమాన భారంతో నిప్పంటించుకున్న బాలిక

Jharkhand Incident

Jharkhand Incident

School Girl sets herself on fire after being ‘FORCED to remove clothes’ by teacher: జార్ఖండ్ రాష్ట్రంలో అమానుష సంఘటన జరిగింది. ఓ టీచర్ చేసిన అవమానం విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణం అయింది. వివరాల్లోకి వెళితే 9వ తరగతి చదువుతున్న బాలిక యూనిఫాం దుస్తుల్లో చిట్టీలు పెట్టి పరీక్ష రాస్తుందని అనుమానించిన ఉపాధ్యాయురాలు సదరు బాలిక బట్టలను బలవంతంగా విప్పించింది. దీన్ని అవమానంగా భావించిన బాలిక నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న బాలికను ఆస్పత్రిల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు వెల్లడించారు.

Read Also: Spanish Paper: దుమారం రేపుతున్న భారత ఆర్థిక వ్యవస్థపై స్పానిష్ పేపర్ కథనం

మహిళా ఇన్విజిలేర్ తనను అవమానించిందని.. యూనిఫాంలో చిట్టీలు పెట్టిందో లేదో తెలుసుకోవడానికి పక్కనే ఉన్న గతిలోకి తీసుకెళ్లి బట్టలను తొలగించిందని బాలిక పోలీసులకు వాగ్మూలం ఇచ్చింది. ఈ ఘటన జరిగిన తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే బాలిక నిప్పంటించుకుందని ఆమె తల్లి వెల్లడించింది. ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పాఠశాల స్పందించలేదు. మరోవైపు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజలు తప్పు చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్ వద్దకు చేరి ఆందోళనలు చేశారు.

మహారాష్ట్రలో విద్యార్థినిపై ఆటో డ్రైవర్ వేధింపులు:

థానే నగరంలో శుక్రవారం నాడు 21 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై ఓ ఆటో డ్రైవర్ వేధింపులకు పాల్పడ్డాడు. వాహనంతో పాటు సదరు విద్యార్థిని ఈడ్చుకెళ్లాడు. ఆటో డ్రైవర్ సదరు యువతిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో యువతి ప్రశ్నించగా.. ఆమె చేతిని పట్టుకుని లాగాడు. ఈ సంఘటన థానే నగరంలో ఉదయం 6.45 గంటలకు జరిగింది. ఈ వీడియో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. దాదాపుగా 500 మీటర్ల వరకు విద్యార్థిని చేతి పట్టుకుని ఆటోతో పాటు ఈడ్చుకెళ్లాడు. ఆమె కింద పడిపోవడంతో ఆటో డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

 

 

Show comments