SBI CBO Recruitment 2026: నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2026 కోసం సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,050 ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తులు జనవరి 29, 2026 నుంచి ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 18, 2026 వరకు వీటిని స్వీకరించనున్నారు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.
READ MORE: Bhumi : ఆరేళ్ల చిన్నారిపై సామూహిక దాడి.. వీధి కుక్కలపై చర్చిస్తాం.. కానీ, వీటిపై మాత్రం మాట్లాడం!
అర్హతల విషయానికి వస్తే.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇంజనీరింగ్, మెడికల్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు ఉన్న అభ్యర్థులు సైతం అర్హులు. కనీస 2 సంవత్సరాల బ్యాంక్ ఆఫీసర్‌గా పని అనుభవం తప్పనిసరి. వయసు 21–30 సంవత్సరాల మధ్య ఉండాలి. SC, ST, OBC (నాన్-క్రీమీ లేయర్), PWD, మాజీ సైనికులకు ప్రభుత్వం age relaxations వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు సాధారణ, OBC, EWS అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. SC, ST, PWD మూడువర్గాలకూ రీయింప్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ విడుదల: జనవరి 28, 2026
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: జనవరి 29, 2026
దరఖాస్తు చివరి తేది: ఫిబ్రవరి 18, 2026
పరీక్ష: మార్చ్ 2026
ఎంపిక ప్రక్రియ..
1. రాత పరీక్ష
2. ఇంటర్వ్యూ
3. భాషా పరీక్ష
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్
5. మెడికల్ పరీక్ష
ఆన్లైన్ దరఖాస్తు విధానం..
1. అధికారిక వెబ్సైట్ sbi.bank.inలోకి వెళ్లాలి.
2. CBO Recruitment 2026 విభాగంలో “Apply Online” పై క్లిక్ చేయాలి.
3. వెలిడ్ ఇమెయిల్, మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అవ్వాలి.
4. దరఖాస్తు ఫారం పూర్ణం చేసి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
5. ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి.