Saurabh Bharadwaj: ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల ముందు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్‌ని అంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. గ్రేటర్ కైలాష్ నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి బిగ్ షాక్, ఎర్లీ ట్రెండ్స్‌లో వెనకంజ..
‘‘ఆప్‌ను ప్రభుత్వం నుంచి తొలగించడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను, ఎన్నికల కమిషన్, పోలీసులు అన్ని అధికారాలను ఉపయోగించి ఆప్‌కి వ్యతిరేకంగా పనిచేశారు. కానీ ఢిల్లీ ప్రజల ఆశీస్సులు ఆప్‌పై ఉన్నాయి. ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌ను నాల్గవసారి ముఖ్యమంత్రిని చేస్తారని, ఆయన త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తారని నేను నమ్ముతున్నాను’’ అని చెప్పారు. ఆప్‌కి 40-45 సీట్లు వస్తాయని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 36.