ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు మనీలాండరింగ్ కేసులో ఊరట దక్కలేదు. ఆయనపై ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం నిరాకరించింది. వైద్య కారణాల రీత్యా తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సత్యేంద్ర జైన్ కోరినప్పటికీ కోర్టు తోసిపుచ్చింది.
ఇది కూడా చదవండి: Krishna Vamsi: నన్ను చూసి ఆఫీస్ బాయ్ అనుకున్నారు.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
అవినీతి నిరోధక చట్టం కింద 2017లో సత్యేంద్ర జైన్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా 2022 మే 30న ఆయనను ఈడీ అరెస్టు చేసింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో 2019 సెప్టెంబర్ 6న ట్రయిల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ మనీలాండరిగింగ్ విచారణలో లీగల్ సవాళ్లను జైన్ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో బెయిలు కోరుతూ జైన్ హైకోర్టుకు వెళ్లారు. తన బెయిలు పిటిషన్‌ను హైకోర్టు ఆరు వారాలు వాయిదా వేయడాన్ని సైతం ఆయన సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో జస్టిస్ మనోజ్ మిశ్రా సారథ్యంలోని ధర్మాసనం బెయిల్ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయొద్దని హైకోర్టుకు సూచిస్తూ, తదుపరి విచారణ తేదీ నాటికి జైన్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. దీంతో జైన్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు జూన్ 28న ఈడీ స్పందన కోరింది. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది. తదుపరి విచారణను మరోసారి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: మద్యం ఎంత లిమిట్లో తీసుకోవాలో తెలుసా..!