Bodh Gaya Temple: మహాబోధి ఆలయం కింద ‘‘భారీ నిర్మాణ సంపద’’.. శాటిలైట్ చిత్రాలతో వెలుగులోకి..
- బోధ్ గయ ఆలయం కింద భారీ నిర్మాణాలు..
- శాటిలైట్ చిత్రాల విశ్లేషణ ద్వారా వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bodh Gaya Temple: గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించి నాలుగు పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా ఉన్న బోధ్ గయాలోని మహాబోధి ఆలయం కింద ‘భారీ నిర్మాణ సంపద’ దాగి ఉన్నట్లు శాటిలైట్ సర్వే విశ్లేషన్ ద్వారా ఆధారాలు లభించాయని అధికారులు శనివారం తెలిపారు. యూకే కార్డిఫ్ యూనివర్సిటీ సహకారంతో బీహార్ హెరిటేజ్ డెవలప్మెంట్ సొసైటీ(బీహెచ్‌డీఎస్) ఈ అధ్యయనం చేస్తోంది. మహాబోధి ఆలయ సముదాయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన ప్రదేశం బోధ్ గయ.
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, దాని పరిసర ప్రాంతాల నేల కింద భారీ పురావస్తు నిర్మాణాలు ఉన్నట్లు అధ్యయనం కనుగొందని, అధికారి హర్జోత్ కౌర్ బమ్రాహ్ చెప్పారు. మహాబోధి ఆలయం మరియు దాని పరిసరాల యొక్క ఉపగ్రహ చిత్రాలను అధ్యయనం చేశామని, కనుగొన్న వాటిని చైనీస్ యాత్రికుడు జువాన్ జాంగ్(హుయత్సాంగ్) చెప్పిన వివరాలతో ప్రస్తుతం కనుగొన్నవాటిని అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు బెంగళూర్‌కి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఫ్యాకల్టీ సభ్యుడు MB రజనీ చెప్పారు.
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
బోధ్ గయలోని ప్రస్తుత మహాబోధి ఆలయ సముదాయంలో 50 మీటర్ల ఎత్తైన ఆలయం వజ్రాసనం, పవిత్ర బోధి వృక్షం మరియు బుద్ధుని జ్ఞానోదయానికి సంబంధించిన ఇతర ఆరు పవిత్ర స్థలాలు ఉన్నాయి. పరిశోధకులు 7వ శతాబ్దపు చైనీస్ సన్యాసి జువాన్‌జాంగ్ యొక్క భారతదేశ ప్రయాణంపై ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. ఆలయానికి ఉత్తరాన, భూగర్భం కింద అనేక నిర్మాణాలు ఉన్నట్లు శాటిలైట్ల చిత్రాల విశ్లేషణ ద్వారా తెలిసింది. నిరంజన నది తూర్పు నుంచి పడమరకు మారడాన్ని చిత్రాలు చూపిస్తున్నాయి.
Read Also: Sanjay Raut: ఎమర్జెన్సీకి ఆర్ఎస్ఎస్ మద్దతిచ్చింది..సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం మహాబోధి ఆలయం నదికి పశ్చిమాన ఉంది, సుజాత స్థూపం, ఇతర పురావస్తు అవశేషాలు నదికి తూర్పున ఉన్నాయి, నదికి తూర్పుగా ఉన్న అవవేశాలు ఇప్పుడు మహాబోధి ఆలయంలో స్వతంత్రమైనవిగా ఉన్నాయి. కానీ ఆలయం, సుజాత స్థూపం, ఇతర పురావస్తు అవశేషాలు రెండూ కూడా గతంలో ఒకే నది ఒడ్డున ఉన్నాయని తాజా అన్వేషణ చూపిస్తుందని పరిశోధకులు చెప్పారు. దీని ప్రకారం చూస్తే, స్మారక చిహ్నాలు, ఇతర పురావస్తు అవశేషాలు నదికి తూర్పున మహాబోధి కాంప్లెక్స్‌లో భాగంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు.
చైనీస్ బౌద్ధ సన్యాసి హుయెత్సాంగ్‌ని జువాన్ జాంగ్‌గా పిలుస్తారు. ఇతను హర్షవర్ధన రాజు పాలనతో భౌద్ధ గ్రంథాలను పొందేందుకు చైనా నుంచి భారత్‌కి వచ్చాడు. 629 నుంచి 645 CE వరకు భారతదేశంలో పర్యటించాడు. 657 భారతీయ గ్రంథాలను చైనాకు తీసుకురావడాని కృషి చేశాడు. ఇతని రచనల ద్వారా చైనాలో బౌద్ధం బలపడింది. 1860-1870లో అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ నలంద, వైశాలి వంటి ప్రదేశాలను గుర్తించేందుకు ఇతని యాత్రా, రచనలు ఉపయోగపడ్డాయి.
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!