NTV Telugu Site icon

RG Kar rape case: జైల్లో సంజయ్‌ రాయ్ కొత్త కోరిక.. ఏం అడిగాడంటే..!

Rgkarrapecase

Rgkarrapecase

కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌కి ఇటీవల కోర్టు జీవితఖైదు విధించింది. ఆగస్టు 23, 2024 నుంచి ప్రెసిడెన్సీ సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. ఇప్పటి దాకా అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న సంజయ్ రాయ్‌కి శిక్ష పడడంతో ఇకపై జైల్లో పని చేయాల్సి ఉంటుంది. పనుల్లో నైపుణ్యం లేని వాడు కాబట్టి అతనికి రోజుకి రూ.105తో కూడిన ఉద్యోగం ఇవ్వబడుతుందని జైలు అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే సంజయ్ రాయ్ జైలు అధికారులను ఒక కోరిక కోరాడు. తనకు పెన్‌, నోట్‌బుక్ ఇవ్వాలని అభ్యర్థించాడు. ఇక సంజయ్ రాయ్‌కి ప్రస్తుతం ఐదు దుప్పట్లు ఉన్నాయి. మరో మూడు అదనంగా కావాలని కోరాడు. దీనిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక సెల్‌లో నడవడం, వ్యాయామం చేసుకునే వెసులబాటు ఉంది.

ఇది కూడా చదవండి: Hyderabad: గాంధీభవన్‌లో ఉద్రిక్తత.. కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు..

సంజయ్ రాయ్ ఆగష్టు 23, 2024 నుంచి ప్రెసిడెన్సీ జైల్లో ఉంటున్నాడు. వర్చువల్ లేదా ఫిజికల్‌గా కోర్టులో హాజరుపరిచే సమయంలో తప్ప మిగతా సమయంలో ఎప్పుడూ సెల్‌లోనే తాళం వేసి ఉంచారు. ప్రస్తుతం ప్రెసిడెన్సీ సెంట్రల్ జైల్లో ఖైదీలు తోటపని, వస్త్రాలు, ఫర్నిచర్, పఫ్డ్ రైస్, అల్యూమినియం పాత్రల తయారీ వంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. నైపుణ్యం లేని కార్మికులకు రూ.105, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.120, నైపుణ్యం కలిగిన కార్మికులు రూ.135 రోజువారీ వేతనం ఇస్తుంటారు. వేతనం.. ఖైదీ ఖాతాలో జమ అవుతుంటాయి. ఆ నగదు.. జైల్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు ఉపయోగించొచ్చు. ఒకవేళ విడుదలైనప్పుడు డబ్బు తీసుకుని వెళ్లొచ్చు. సంజయ్ రాయ్‌ తోటపనిలో పాల్గొనవచ్చని సమాచారం.

ఆగస్టు 9, 2024న కోల్‌కతా ఆర్‌జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. తాజాగా న్యాయస్థానం కూడా దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది. ఇదిలా ఉంటే ఈ తీర్పుపై బెంగాల్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది.

ఇది కూడా చదవండి: Mahakumbh 2025: మహా కుంభమేళాలో ముస్లిం మహిళలు.. సీఎం యోగిపై పొగడ్తల వర్షం..