Sanjay Raut: మా ఓటమికి మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కారణం.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ..
- మా ఓటమికి కారణం మాజీ సీజేఐ చంద్రచూడ్..
- ఠాక్రే సేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ) దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో భాగస్వామి అయిన ఉద్ధవ్ సేన 95 సీట్లలో పోటీ చేస్తే కేవలం 20 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదని ఠాక్రే నిరాశనను వెలిబుబ్చారు. ఇదిలా ఉంటే, రాజ్యసభ ఎంపీ, ఠాక్రే సేన నేత సంజయ్ రౌత్ మాత్రం ఓటమికి పలు కారణాలను వెతుకుతున్నారు.
మహాయుతి ఘన విజయం పట్ల సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. తాజాగా తమ పార్టీ ఓటమికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కారణమంటూ ఆదివారం విమర్శలు చేశారు. ‘‘ అతను (చంద్రచూడ్) ఫిరాయింపుదారుల నుంచి చట్టం అంటే భయాన్ని తొలగించారు. అతడి పేరు నల్ల అక్షరాలతో వ్రాయబడింది’’ అని అన్నారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా, ఫిరాయింపుదారులకు తలుపులు, కిటికీలు తెరిచి ఉంచారని విమర్శలు చేశారు.
Also Read
Read Also: IPL Auction 2025: ప్రారంభమైన ఐపీఎల్ మెగా వేలం.. వీరిపైనే భారీ అంచనాలు
2022లో శివసేన పార్టీలో ఏక్నాథ్ షిండే చీలిక తీసుకువచ్చారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు షిండేకి ఉండటంతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం పదవిని స్వీకరించారు. అయితే, ఇలా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఠాక్రే వర్గం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. స్పీకర్ రాహుల్ నార్వేకర్ షిండే శివసేననే అసలైన శివసేనగా ప్రకటించింది. దీనిని ఉద్దేశిస్తూ రౌత్ మాజీ సీజేఐ చంద్రచూడ్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ మేము విచారంగా ఉన్నాం కానీ నిరాశ చెందలేదు. పోరాటాన్ని అసంపూర్తిగా వదిలిపెట్టము. ఓట్ల విభజన కూడా ఒక అంశం, మరియు ఎన్నికల్లో RSS ముఖ్యమైన పాత్ర పోషించింది. విషపూరిత ప్రచారం మమ్మల్ని ప్రతికూలంగా ప్రభావితం చేసింది’’ అని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవాన్ని పొరుగున ఉన్న గుజరాత్లో నిర్వహించాలని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సంజయ్ రౌత్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన 95 సీట్లలో 20 మాత్రమే గెలుచుకోగలిగింది. మొత్తం 101 స్థానాలకు గాను కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక మహాయుతి గత దశాబ్ధాల రికార్డుని బద్దలు కొడుతూ మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను గెలుచుకుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు