Site icon NTV Telugu

కాంగ్రెస్ తీరుపై శివ‌సేన ఎంపీ అసంతృప్తి…ఒంట‌రిగా పోటీచేస్తానంటే…

మ‌హారాష్ట్ర‌లో మ‌హా అఘాడి సంకీర్ణ స‌ర్కార్ లో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి.  సంకీర్ణ ప్ర‌భుత్వంలోని శివ‌సేన‌కు, కాంగ్రెస్ పార్టీకి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న‌ది.  కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే ఎన్నికల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని ఆ పార్టీనేత నానా ప‌టోలె పేర్కొన్నారు.  అధిష్టానం ఆదేశిస్తే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధిగా ఎదుర్కొనేందుకు తాను సిద్దంగా ఉన్నానని ప‌టోలె పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.  దీనిపై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ కౌంట‌ర్ ఇచ్చారు.  రాజ‌కీయ పోరాటాల‌ను త‌మ పార్టీ సొంతంగా చేస్తుంద‌ని, ఒంట‌రిగా పోటీ చేయాల‌ని అనుకునేవారు ఆ విధంగా చేసుకోవ‌చ్చ‌ని సంజ‌య్‌రౌత్ తెలిపారు.  ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్ర‌మే కూట‌ములు ఏర్పాట‌వుతాయ‌ని, మిగ‌తా స‌మ‌యాల్లో రాజ‌కీయ పోరాటాలు ఒంట‌రిగానే జ‌రుగుతాయ‌ని సంజ‌య్ రౌత్ తెలిపారు.  

Exit mobile version