Site icon NTV Telugu

Sanjay Raut: బీహార్ ఎన్నికలకు ముందే తహవూర్ రాణాని బీజేపీ ఉరి తీస్తుంది..

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసులో కీలక సూత్రధారి, ఉగ్రవాది అయిన పాక్ -కెనెడియన్ పౌరుడు తహవూర్ రాణానికి అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. ఈ దారుణ ఘటన జరిగిన 17 ఏళ్ల తర్వాత, నిందితుడిని భారత న్యాయ వ్యవస్థ ముందు నిలబెట్టారు. అంతకుముందు, అమెరికా భారత్‌కి తనను అప్పగించకుండా ఉండేందుకు రాణా విఫలయత్నాలు చేశాడు. చివరకు అమెరికా కోర్టులు భారత్‌కి అప్పగించాలని తీర్పు చెప్పాయి.

Read Also: Waqf Act: ‘‘తలలు పగలాలి, 10 మంది చావాలి’’.. వక్ఫ్ చట్టంపై హింసను ప్రేరేపించిన కాంగ్రెస్ నేత..

ఇదిలా ఉంటే, రాణా అప్పగింతపై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న, ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన ఉగ్రవాదిని భారత్‌కి తీసుకువచ్చిన భారత ప్రభుత్వాన్ని, ఏజెన్సీలను స్వాగతించాలి. అయితే, బీజేపీ వైఖరి సరైనది కాదు, వారు తహవూర్ రాణాను మరణశిక్ష విధించడానికి లేదా క్రెడిట్ తీసుకోవడానికి తీసుకువచ్చారా..? వారు ‘‘రాణా ఉత్సవం’’ చేయబోతున్నట్లు కనిపిస్తోంది. వారు రాణాను రాజకీయం చేస్తున్నారు. బీహార్ ఎన్నికల ముందు తహవూర్ రాణాని ఉరితీస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని అన్నారు. అయితే, సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సంజయ్ రౌత్‌ని మూర్ఖుడిగా అభివర్ణించారు. మూర్ఖుడి వ్యాఖ్యలకు తాను స్పందించనని అన్నారు.

Exit mobile version