Sambhal Mosque Survey: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో గల షామీ జమా మసీదు కమిటీకి భారీ ఊరట లభించింది. సంభాల్ మసీద్ వివాదంపై విచారణకు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సర్వే ఆర్డర్‌ను సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను హైకోర్టులో లిస్ట్ చేసే వరకు సంభాల్ జామా మసీదుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొనసాగించరాదని సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Also: NTRNeel : తారక్ – ప్రశాంత్ నీల్ టైటిల్ ఇదే..?
ఇక, అడ్వకేట్ జనరల్ ఇచ్చిన నివేదికను సీల్డ్ కవరులో ఉంచాలని.. దీన్ని తెరవవద్దని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 8కి వాయిదా వేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. అప్పటి వరకు శాంతి భద్రతలను కాపాడాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక, జమియత్ ఉలమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ అసద్ మదానీ మాట్లాడుతూ.. పాతి పెట్టిన మృతదేహాలను కూల్చివేయడం ద్వారా దేశంలోని లౌకిక పునాదులు కదిలిపోతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, సంభాల్‌లోని షామి జామా మసీదులో సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులపై కొన్ని ముస్లిం సంఘాల నేతలు రాళ్లతో దాడికి దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ అల్లరి మూకలను చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించగా.. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరోవైపు పలువురు పోలీసులు సైతం తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.