NTV Telugu Site icon

Sengol: పార్లమెంట్లో ‘‘సెంగోల్’’ స్థానంలో రాజ్యాంగం పెట్టాలి.. అఖిలేష్ పార్టీ ఎంపీ డిమాండ్..

Sengol

Sengol

Sengol: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభ సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ‘సెంగోల్’ని ప్రతిష్టించారు. ఆ సమయంలో ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ సెంగోల్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ(ఎస్పీ)కి చెందిన ఎంపీ ఆర్‌కే చౌదరి సెంగోల్ స్థానంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. 5 అడుగుల పొడవు, బంగారు పూతతో చేతితో తయారు చేసిన సెంగోల్ గురించి మరోసారి చర్చ మొదలైంది.

యూపీ మోహన్‌లాల్ గంజ్ ఎంపీగా ఉన్న చౌదరి సెంగోల్ స్థానంలో రాజ్యాంగం తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని ఆమోదించడం దేశంలో ప్రజాస్వామ్యానికి నాంది పలికింది, రాజ్యాంగం దాని చిహ్నం. బిజెపి ప్రభుత్వం తన చివరి టర్మ్‌లో స్పీకర్ కుర్చీ పక్కన ‘సెంగోల్’ని ఏర్పాటు చేసింది. సెంగోల్ అనేది తమిళ పదం, దీని అర్థం రాజదండం. రాజ్‌దండ్ కూడా రాజుల యుగం తర్వాత మనం స్వతంత్రులం అయ్యాం అని అర్థం. ప్రస్తుతం ప్రతీ ఒక్కరు కూడా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని దేశంలో ఎన్నుకుంటున్నారు. దేశం రాజ్యాంగం ఆధారంగా నడుస్తుంది. రాజదండం ద్వారా కాదు.’’ అని అతను అన్నారు.

Read Also: Addanki Dayakar : బీఆర్ఎస్‌కు అసెంబ్లీలో ఏ అంశాలు ఎత్తుకోవాలని తెలవడం లేదు

ఈ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని 80 ఎంపీ స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లను గెలుచుకుంది. పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ఎస్పీ మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. పార్టీ ఎంపీ వ్యాఖ్యపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. సెంగోల్ పెట్టిన సమయంలో ప్రధాని దానికి నమస్కరించారు, కానీ ఈ సారి ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ఆయన నమస్కరించడం మరిచిపోయారని, మా ఎంపీ ప్రధానికి గుర్తు చేయాలనునకుంటున్నారని నేను భావిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, ఆర్జేడీ ఎంపీ లాలూ కుమార్తె మిసా భారతి కూడా ఎస్పీ ఎంపీ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు.

అయితే, ఎస్పీ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. సమాజ్‌వాదీ పార్టీకి భారతీయ చరిత్ర, సంస్కృతి పట్ల గౌరవం లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తమిళ సంస్కృతి పట్ల భారత కూటమి యొక్క ద్వేషాన్ని చూపిస్తోందని యోగి అన్నారు. గతంలో ఎస్పీ రామచరితమానస్‌పై దాడి చేసిందని, ఇప్పుడు భారత సంస్కృతిపై దాడి చేసిందని చెప్పారు. ఈ అవమానికి డీఎంకే ఎలా స్పందిస్తుందో చెప్పాలని యోగి అన్నారు.