NTV Telugu Site icon

UP News: మహిళా లాయర్‌పై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి అత్యాచారం..

Samajwadi Party

Samajwadi Party

UP News: ఉత్తర్ ప్రదేశ్‌లో వరసగా సమాజ్‌వాదీ(ఎస్పీ) నేతలు అత్యాచారం కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఎస్పీకి చెందిన సీనియర్ నేత, మాజీ రాష్ట్ర కార్యదర్శి వీరేందర్ బహదూర్ పాల్ ఓ మహిళా లాయర్‌పై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సదరు లాయర్ అతడి దగ్గర సహయకురాలిగా పనిచేసేది. ఈ ఆరోపణలతో వీరేందర్ పాల్ పాల్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడిని పట్టుకునేందుకు వేట ప్రారంభించారు. మౌ బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్‌గా రెండుసార్లు పనిచేసిన వీరేందర్‌పై బాధితురాలు ఫిర్యాదు చేశారు.

Read Also: Ram Nagar Bunny: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.. “రామ్ నగర్ బన్నీ” ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్..

తన వీడియోలు, ఫోటోలు ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేస్తూ ఏడాదిగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని మహిళా లాయర్ ఆరోపించింది. అతను తనను పదేపదే బెదిరించాడని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఫిర్యాదు నమోదు కావడంతో వీరేందర్ పరారీలో ఉన్నారు. పరీక్షల నిమిత్తం మహిళను వైద్య పరీక్షలకు పంపించారు. కోర్టు పరిసరాల్లో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య భౌతిక దాడి జరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

మౌ సిటీ సర్కిల్ ఆఫీసర్ (CO) అంజనీ కుమార్ పాండే మాట్లాడుతూ..‘‘సెప్టెంబర్ 07న బాధితురాలు తాను దుర్కొన్న లైంగిక వేధింపులు, శారీరక హింస మరియు బెదిరింపులను సంబంధించి ఫిర్యాదును నమోదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా, తగిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది’’ అని చెప్పారు. వీరేందర్ పాల్ ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది మాత్రమే కాకుండా, ప్రముఖ ఎస్పీ నేత. ఇతడి తండ్రి దయారామ్ పాల్ బీఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా పనిచేశాడు. ప్రస్తుతం ఇతను ఉత్తరాఖండ్ పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూనే, ఎస్పీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇప్పటికే ఎస్సీ నేత నవాబ్ సింగ్ యాదవ్ 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఇతను అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌కి మాజీ సహాయకుడిగా ఉన్నాడు.

Show comments